


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూన్ 23:

డాక్టర్ కారెం రవితేజ కు పుట్టినరోజు V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అతికొద్ది కాలంలో గుర్తింపు పొందిన కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పటల్ (మేనేజ్ మెంట్ డైరెక్టర్) మరియు డాక్టర్ కారెం రవితేజా ఎండి గారికి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

కనులు విందుగా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకకు V9 ప్రజా ఆయుధం మీడియా ప్రతినిధి వినయ్ కుమార్ హాజరు కావలసి ఉన్నది. అయితే అనివార్యం కారణం వల్ల, సోమవారం కోనసీమ కేర్ ఆసుపత్రి నందు డాక్టర్ రవితేజను వినయ్ కుమార్ కలిసి గౌరవప్రదంగా పూల మొక్కను అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ దేవుని వేడుకున్నారు.

అంతేకాకుండా చిన్నతనం లోనే వైద్య వృత్తిని ఎన్నుకుని ఎందరకో కరోనా సమయంలో మేలైన వైద్య సేవలను అందించి ప్రాణాలను కాపాడిన గొప్ప వైద్య అధికారిగా జిల్లా, రాష్ట్రం, దేశా స్థాయిలో ఉత్తమ వైద్య నిపుణులుగా అవార్డు అందుకున్నారన్న విషయాలను జర్నలిస్టు వినయ్ కుమార్ మరోసారి డాక్టర్ రవితేజకు గుర్తుచేస్తూ.. అభినందించారు.

అంతేకాకుండా డాక్టర్ గానే ఉండిపోకుండా ఉద్యమ నాయకులు తండ్రి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వారసులుగా ఆయన అడుగుజాడలో నడవటానికి రాజకీయ అరంగేట్రం (రంగప్రవేశం) చెయ్యాలని ఆయనకు సూచించారు. ఈ సందర్భంలో ఆయన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ విధంగా ప్రయాణిద్దామని అన్నారు.