అమలాపురం ఎమ్మార్వోకు యోగ అవార్డు లభించింది.




V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25:

రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాలలో భాగం గా ఈనెల మూడో తేదీన బీచ్, దేవాలయ యోగాస నాల కార్యక్రమంలో భాగంగా అంతర్వేది సముద్ర తీరం నందు 3వేల మందితో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహార యోగాసన లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.

బుధవారం ఈ యొక్క అవార్డు విజయోత్సవ వేడుకలను స్థానిక గోదావరి భవన్ నందు అధికారులతో నిర్వహిం చారు. కోనసీమ జిల్లాకు యోగేంద్ర నోడల్ అధికారిగా నియమింపబడ్డ జిల్లా జాయింట్ కలెక్టర్ సారధ్యంలో జిల్లా స్థాయి అధికారులు బృందం అంతర్వేదిలో 3వేల మందితో వాడపల్లిలో 5 వేలమందితో ద్రాక్షారామం లో2 వేల మందితో పాటు గా రైతులు సీనియర్ సిటిజెన్సు కార్మికులు వంటి ప్రతి వర్గానికి నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు విజయ వంతం అయ్యాయన్నారు ఈ సందర్భంగా యోగా ఆంధ్రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాoతి, మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి పర్యవేక్షణ లో జిల్లాకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు రావ డం అభినందనీయమన్నారు.

జిల్లావ్యాప్తంగా మాస ఉత్సవాలలో భాగంగా 22 మండలాలు 4 మున్సిపాలిటీలు పరిధిలో జిల్లాలో సగభాగం అయిన 8 లక్షల మంది 4,650 వేదికలలో యోగాసనాలు వేశారన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని,ఈ అవార్డు సాధించడం వెనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భం గా పలువురు జిల్లాస్థాయి అధికారులను ప్రశంసాప త్రాలు అందించి సాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్ర మంలో జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు డిఆర్ఓ రాజకుమారి ఆర్డీవోలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు