కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు గత సంవత్సరం 785 మంది పై కేసులు.

సంక్రాంతి సందర్భంగా రికార్డింగ్ డాన్సులు నిషేధం : కలెక్టర్ మహేష్ కుమార్.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, జనవరి 09:

ప్రభల తీర్థాలు నిర్వహించే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఆదేశాలు.

ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సంక్రాంతిని జరుపుకోవాలి : జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

కోడిపందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు రెవెన్యూ, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి కోడి పందేల నిర్వహణను అడ్డుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని.. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడిపందేలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గేమింగ్ చట్టం 1974, జంతు హింస నివారణ చట్టం 1960 ప్రకారం క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించి కోడిపందేలు నిర్వహించకుండా సంబంధిత బృందాలు ప్రత్యేక దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా కూడా రికార్డింగ్ డాన్సులు నిర్వహించరాదని.. రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తే ఆయా ప్రైవేటు స్థలాలను జప్తు చేసే విధంగా రెవెన్యూ చట్టాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ప్రభల తీర్థాలు నిర్వహించే జగ్గన్న తోట, అంబాజీపేట, శివకోడు తదితర ప్రాంతాలలో జనం రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా సంబంధిత మేనేజ్మెంట్ కమిటీలు తగిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి ,ఈ పిడిసిఎల్, అగ్నిమాపక అధికారులు, ఎంపీడీవోలు ఈవోపీఆర్డీలతో కూడిన మండల స్థాయి బృందాలను నియమించి సంబంధిత ప్రభల తీర్థాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కోడి పందేలు జరుగుతాయని ముందస్తు సమాచారం ఉన్న ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేసేలా సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సంక్రాంతి సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయ పద్ధతులలో సంక్రాంతి నిర్వహించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మాట్లాడుతూ.. గతంలో కోడిపందేలు నిర్వహిస్తూ పట్టుబడిన సుమారు 785 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడా కోడిపందేలు నిర్వహించకూడదని.. నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి, అమలాపురం కొత్తపేట రామచంద్రపురం రెవిన్యూ డివిసన్ అధికారులు కే మాధవి, శ్రీకర్, డి అఖిల,అమలాపురం డి.ఎస్.పి టిఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కంప్యూటర్ ఆధారిత పరీక్ష రీ షెడ్యూల్ చేయబడింది: కొత్త తేదీలను తనిఖీ చేయండి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 02: The High Court of Andhra Pradesh has released a new schedule for the computer-based […]

సవరప్పాలెం స్మశాన వాటిక దగ్గర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలి: గ్రామ పెద్దలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 08:అమలాపురం మండలం సవరప్పాలెం స్మశాన వాటిక దగ్గర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలి అని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో తాగుబోతులకు అడ్డాగా […]

విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన/ విద్యుత్ అంతరాయం టోల్ ఫ్రీ నెంబర్ :1912

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 13: విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా 24 గంటలు, 7 రోజులు నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ […]