
రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయరాజు డిమాండ్
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గా ఎస్ ఎన్ మునేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉందుర్తి వీర వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం జనవరి 05:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఏ పీ టి ఎఫ్ 1938 రి” నూతన జిల్లా కార్యవర్గం ఎకగ్రీవం.
ఆదివారం రాష్ట్ర ఏ పీ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయ రాజు అధ్యక్షతన ముమ్మిడివరం లో ఏ పీ టి ఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ పీ టీ ఎఫ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా అధ్యక్షులుగా ఎస్ ఎన్ ముణేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉందుర్తి వీర వెంకట్రావు రాష్ట్ర కౌన్సిలర్ గా జి వి వి సత్యనారాయణ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులను సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు మాట్లాడుతూ.. వెంటనే ఐ ఆర్ డి ఏ లు ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్థిక బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు ను వెంటనే ఉపాధ్యాయులకు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయులకు విద్యాశాఖలో జరుగుతున్న ఉపాధ్యాయలపై యాప్ ల భారం విపరీతంగా పెరిగి భోధాన సమయం హరించి వేస్తుందని ఈ యాప్ ల భారాన్ని ఉపాధ్యాయులపై తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగబత్తుల నరసింహమూర్తి వై.వెంకట్ రాజు, ఏ ఉదయ బ్రహ్మం, ఈ అప్పయ్య, కె.వి వి సత్యనారాయణ మోర్త రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
