డీఆర్డిఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) విభాగాలలో ఉద్యోగాల భర్తీ.

DRDO Recruitment Notification: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డిఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) విభాగాలలో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 152

👉సైంటిస్ట్-బి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (RAC) ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. సైన్స్ విభాగాలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తు కోరుతున్నారు.

👉పోస్టులు – వివరాలు:
▪️డీఆర్డిఓలో సైంటిస్ట్-బి- 127 పోస్టులు
▪️ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి- 9 పోస్టులు
▪️ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి- 16 పోస్టులు

👉వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

▪️ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్, సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, గణితం, సివిల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటమోలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

👉అర్హత: అభ్యర్థులు సబ్జెక్టులో వ్యాలిడ్ గేట్ స్కోర్తో పాటు ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లాస్ట్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

శాలరీ: నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.1,00,000/- జీతం వరకు వస్తుంది.

👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.100 /- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేది: జూలై 4,2025

👉Website: https://rac.gov.in/

Related Articles

మానేపల్లి లో అక్రమ ఇసుక తవ్వకాలు పై కన్నుఎర్ర

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 14: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం శివాయిలంక నందు అక్రమంగా మట్టి […]

బాణాసంచా తయారీ కేంద్రాలు కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీకిలు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం, అక్టోబర్ 17: బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగు తోందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య […]

తాసిల్దార్ కార్యాలయానికి రాజ్యాంగ నిర్మాత చిత్రపటాన్ని బహుకరించిన దళిత చైతన్య వేదిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు, ఆగస్ట్ 19 : రాజోలు తాసిల్దార్ కార్యాలయానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ […]

నాడూ నేడూ బాలయోగి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆఖిల పక్ష విదేశీ బృందంలో సభ్యునిగా వెళ్లనున్న ఎంపీ హరీష్ ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎన్డీయే ప్రభుత్వంలో యువతను […]