
మానసిక ఒత్తిడికి యోగా సరైన మార్గం…


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19:

ప్రతి మనిషి తన జీవితంలో పడే మానసిక ఒత్తిడికి యోగా సరైన మార్గం అని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి అన్నారు.ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని తెలిపారు.మానసిక ఒత్తిడి కారణంగా మనిషి ఆరోగ్యంగా పాలవుతారని ఒత్తిడి ని అధిగమించాలంటే యోగా సాధన తప్పనిసరిగా అలవరుచుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఈ నెల 21 న వైజాగ్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు అవడం యోగా యొక్క ఆవశ్యకతను ప్రజలకు అర్థం అవుతుందని తెలిపారు.వైజాగ్ లో జరిగే ఈ యోగాంధ్రా కార్యక్రమం గొప్ప విశిష్టతను సంతరించుకుంటుందని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.అనతరం ఇటీవల ఉగ్రవాదం పై భారతదేశ గళాన్ని అయిదు దేశాలకు వినిపించి వచ్చిన తరుణంలో ఎంపీ హరీష్ బాలయోగిని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం దుశ్శాలువాలతో సత్కరించారు.