
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 14:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం శివాయిలంక నందు అక్రమంగా మట్టి త్రవ్వకాలు నిర్వహిస్తున్న ఐదు ఖాళీ లారీలను ఒక మట్టి లోడుతో ఉన్న లారీని మరో రెండు మట్టి తవ్వకాలు నిర్వహించే టాటా హిటాచి జెసిబి లు సీజ్ చేసినట్లు జిల్లా భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు ఎల్ వంశీధర్ రెడ్డి తెలిపారు. మట్టి తవ్వకాలు అక్రముగా నిర్వహిస్తు న్నట్లు సమాచారాన్ని తెలుసుకొని పి గన్నవరం తాసిల్దార్ పి శ్రీ పల్లవి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి గంగా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నాగన్న భూగర్భ గనుల శాఖ రియాల్టీ ఇన్స్పెక్టర్ సుజాత టెక్నికల్ అసిస్టెంట్ రెహమాన్ అలీ సంయుక్తంగా తనిఖీ నిర్వ హించి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టే వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరించడంతోపాటు అక్రమ మైనింగ్ చట్ట ప్రకారం కఠిన చర్యలు గైకొనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
