

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి గన్నవరం జూన్ 18:

ఇసుక మట్టి అక్రమ తవ్వకాల పై భూగర్భ, రెవిన్యూ శాఖలు సంయుక్తంగా చేపట్టిన సాధారణ తనిఖీలలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండల పరిధిలో బెల్లంపూడి గ్రామం నందు ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న నాలుగు లారీలు రెండు జెసిబి మిషన్లు గుర్తించి అక్కడికక్కడే సీజ్ చేసినట్లు భూగర్భ గనుల శాఖ రియాల్టీ ఇన్స్పెక్టర్ టి సుజాత బుధవారం తెలిపారు.ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్య లు గైకొనడం జరుగు తుందని ఆమె హెచ్చరిం చారు. తప్పనిసరిగా ఇసుక మట్టి తవ్వకాలకు సంబంధించి పక్కాగా అనుమ తులు పొందా లని లేనిపక్షంలో శాఖ పరంగా తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తాహ సిల్దార్ పి శ్రీ పల్లవి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
