


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 13:
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి సీనియర్ నాయకుడు,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు అందించారు .గుడ్ సీడ్ ఫౌండేషన్, మిరాకిల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాకినాడ కు చెందిన గుత్తుర్తి సుగుణ రాణి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించారు.ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సుగుణరాణి సమస్యను పలువురు రమణారావు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన రమణారావు శుక్రవారం అమలాపురంలోని గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ టీమ్ సభ్యుల ద్వారా సుగుణరాణి కి అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ఆమె బంధువులు నవీన్ కు అందజేశారు. ఆక్సిజన్ కాన్సం ట్రేటర్ ను అందజేసిన గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ రమణారావు కు సుగుణరాణి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ముత్తాబత్తుల గణేష్, ముత్తాబత్తుల రవి, జల్లి గోపి,జల్లి సురేంద్ర,ఫౌండేషన్ సభ్యులు పరమట రాజేష్,విప్పర్తి రమేష్, బల్లా చినరాజా తదితరులు పాల్గొన్నారు.