
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మంగళగిరి జూలై 01:

అప్పటి వరకు పాత కమిటీలే కొనసాగింపు…
తెలుగుదేశం పార్టీ సంస్దాగత ఎన్నికల ప్రక్రియ మండలాలలో గ్రామ కమిటీ అద్యక్షుడు ప్రధాన కార్యదర్శి (ఓటు లేదా వారి అభిప్రాయం) తెలిపి మెజార్టీ గ్రామ శాఖ అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓట్లు వేసినా మెజార్టీ ఓట్లు సాదించినప్పటికీ పరిశీలకులు అభ్యర్దిని ప్రకటించ కూడదు. ఒకరి కంటే ఎక్కవ మంది అభ్యర్దులు పోటీ పడ్డా లేదా ఒక్కరే పోటీ పడినా కుడా క్షేత్రస్దాయిలో అభిప్రాయం అధినాయకత్వానికి తెలపాలని వారు అభ్యర్దులపై ఐ వి ఆర్ యస్ ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సర్వీస్ ద్వారా పూర్తిస్దాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన తరువాత, అభ్యర్దికి వచ్చిన ఐ వి ఆర్ యస్ పర్సంటేజ్ సంతృప్తి కరంగా ఉంటే. అప్పుడు అభ్యర్ది పేరు అధినేతకు పంపిస్తారని, అధినేత అంగీకారం తరువాత మండల పార్టీ అద్యక్షున్ని కార్యదర్శిని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.