
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 6

అయినవిల్లి తహసీల్దార్ సి నాగ లక్ష్మమ్మ పై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ ఘటనకు సంబంధించి విచారణ జరి పి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
