ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పై ఎస్సీ కమిషన్ చైర్మన్ సీరియస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఎస్సి కమిషన్ కార్యాలయం కొవ్వూరు , జూన్ 12:

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసును ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సీరియస్ గా తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేసారు.

గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంత బాబు అత్యంత క్రూరంగా తన డ్రైవర్ దళిత యువకుడైన వి.జి సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన ఆరోపణ ఉన్న నేపథ్యంలో, గురువారం సుబ్రమణ్యం తల్లిదండ్రులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్ కాకినాడ జిల్లా గొల్లలమామిడాల వారి నివాసంలో పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి హత్య చేయటం హేయమని అన్నారు.కుటుంబ సభ్యుడని కోల్పోయిన వారి పరిస్థితి, వారి జీవనోపాధి గురించి వాకబు చేశారు.వాళ్లకు ఇల్లు లేకపోవడం, కేటాయించిన స్థలంలో నిర్మాణ విషయంలో ఇబ్బందులు ఎదురవటం గురించి తహసీల్దార్ శాసనసభ్యులు రామకృష్ణా రెడ్డి ను అడిగి తెలుసుకుని ఆ సమస్య సత్వరమే పరిష్కారమయ్యేలా కృషి చేయమని ఆదేశించారు .

సుబ్రహ్మణ్యం తల్లికి ఉపాధి అవకాశం కల్పించాలని కమిషన్ తరపున ఆదేశాలు ఇచ్చారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవటం కోసం కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని జవహర్ తెలిపారు. మొదటి నుంచి ప్రత్యేకమైన శ్రద్ధతో సుబ్రహ్మణ్యం హత్య కేసుని రీ-ఇన్వెస్టిగేట్ చేయటం అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని , లీగల్ టీమ్ ని కూడా ప్రత్యేకంగా నియమించిందని అన్నారు. వారి కుటుంబానికి అండగా నిలబడ్డ రామకృష్ణారెడ్డి తహసీల్దార్ ని జవహర్ అభినందించారు. అండగా ఉన్న వారిని అభినందించటం ,అండగా ఉండే విధంగా సహకరించటం ఈ రెండు కమిషన్ యొక్క బాధ్యత అని , బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎస్సి కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు.

Related Articles

ఆంధ్రప్రదేశ్: ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల.

నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అమరావతి: ఏపీ (AP)లో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Seats) సోమవారం నోటిఫికేషన్ […]

ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 05: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మే ఒకటో తేదీ నుండి ఇసుక త్రవ్వకాలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 17: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచులను మే ఒకటో తేదీ నుండి […]

రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తాం: ఒంటెద్దు వెంకయ్య నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 23: అమలాపురంలో క్రీడా రంగానికి మారుపేరు రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) ఆయన ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మకు […]