V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 23: అమలాపురంలో క్రీడా రంగానికి మారుపేరు రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) ఆయన ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ నందు కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశి అకాల మరణానికి చింతిస్తూ.. సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద రెండు నిమిషాల పాటు మౌనం వహించి నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఒంటెద్దు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… క్రీడారంగానికి ఎన్నో విశిష్టమైన సేవలు అందించి పెద్ద దిక్కుగా వ్యవహరించిన తీరు మరుపు రానిది అన్నారు. ఎందరునో క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందిని ఒంటెద్దు పేర్కొన్నారు. ఓసి క్లబ్ ను ఏర్పాటు చేసి షటిల్ బ్యాడ్మింటన్ హబ్ గా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఎందరునో క్రీడా ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించారు అని రంకీ రెడ్డిను గుర్తు చేశారు. త్వరలో క్రీర్తీ శేషులు రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సంతాప కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆశేట్టి ఆదిబాబు, క్రీడా భారత సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్ర మూర్తి, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు మట్టపర్తి సముద్రం,నార్ని శ్రీను,
చిక్కం రాజబాబు, గంగ్గుమళ్ళ దొరబాబు, మరియు హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారులు పాల్గొన్నారు అని కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు.
రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తాం: ఒంటెద్దు వెంకయ్య నాయుడు
February 23, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 110 అర్జీలు : కలెక్టరేట్ అమలాపురం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 13: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై వుందని డాక్టర్ బి […]
రావులపాలెం ఆత్రేయపురంలో పడవల పోటీలు ప్రారంభించిన ఎంపీ గంటి హరీష్ మాధుర్ (బండారు)
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఆత్రేయపురం జనవరి 11: గోదావరి తీరాన ప్రకృతి రమణీయతతో అలరించే కోనసీమ ప్రాంత సంక్రాంతి సంబ రాలను కేరళ తలపించే మాదిరిగా ఔత్సాహిక క్రీడాకా రులను […]
మూత్రపిండాల్లో రాళ్లు/ ఉన్నవాళ్లు తినకూడనివి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 22: కిడ్నీ రోలు ఉన్నవాళ్లు, ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఉన్నవాళ్లు, కొన్ని రకాల ఆహారాలను నివారించడం లేదా తగ్గించడం చాలా […]
గన్నవరపు సూర్యనారాయణ కళ నెరవేరుతుంది: ఉమ్మడి ఆంధ్ర మాజీ మంత్రి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు జనవరి 23: గన్నవరపు సూర్యనారాయణ కళ నెరవేరబోతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ […]