

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 12:
నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సంద ర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఈ దిగువ ఉదహరించడమైనదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.
1) జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అన్ని పెన్షన్లు కేటగిరీ వారీగా గత గవర్నమెంట్ 18 కేటగిరీ లలో మార్చి 2024 వరకు ప్రతి నెల రూ 71,33,33,000లు మంజూరు చేయడం జరిగిందన్నారు.ప్రస్తుత గవర్నమెంటు వచ్చిన ప్పటి నుండి ది. ఏప్రిల్ 2024 జూన్ 2025 వరకు 28 కేటగిరీలలో ప్రతి నెల పింఛనుదారులకు
రూ 101,15,69,5000 పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ప్రతి నెల రూ 30,26,03,500లు పింఛను సొమ్ము పెంచి చెల్లి స్తున్నట్లు తెలిపారు
2) జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా దీపం – 2 క్రింద మొత్తం 537962 మంది బియ్యం కార్డుదా రులు అర్హులన్నారు
దీపం-2 కింద, ఉజ్జ్వల పథకం లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మొ త్తాన్ని రూ.310/- తగ్గించిన పిమ్మట మరల లబ్ధిదారుడు చెల్లించిన సిలిండర్ ధర 831.50లు సబ్సిడీగా చెల్లించిన 48 గంటల లోపల లబ్ధిదా రులు ఖాతాకు జమ అవుతుందన్నారు
ఆధార్ అప్డేట్ కాకపో వుట, బ్యాంక్ అకౌంట్ లింకు లేకపో వుట, ఎంపీసీఐ లింకు లేక పోవుట మొదలైన దీపం వైఫల్య కేసులకు సంబంధించి, రిమార్క్తో కూడిన వినియోగదారుల జాబితాలను సంబంధిత ఎల్పిజి ఏజెన్సీలకు వారా నికోసారి వినియోగదారు లతో తదుపరి సరిదిద్దడం కోసం పంపడం జరుగు తుందన్నారు.
3)రహదారులు మరియు భవనములు శాఖ: జిల్లాలో 159 పనులతో గుంతలు రహిత కార్యక్రమానికి గాను ప్రభుత్వం రూ 38 కోట్ల లు కేటాయించారనీ దీనితో 643.29 కి.మీ మేర ప్రధాన జిల్లా రోడ్లు మరియు రాష్ట్ర రహదా రుల మరమ్మత్తు పనులు పూర్తి చేయబడినవనీ, 2 బ్రిడ్జి పనులకు గాను రూ.4.00 కోట్లలతో పనులు జగుగుచున్న వనీ మరియు రెండు రోడ్ పనులకు గాను నాబార్డ్ నిధులతో రూ.4.22 కోట్లు మంజురయ్యి టెండర్ దశలో వున్నాయన్నారు
4)జిల్లా పౌర సరఫరాల సంస్థ కోనసీమ జిల్లా ధాన్యము సేకరణ ద్వారా ఖరీఫ్ రబీ సీజన్లోకనీస మద్దతు ధరలు కల్పిం చడం జరుగుతుంద న్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పడి భోజన పాఠశాలలు మరియు హాస్టళ్లకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణి ప్రారంభించినట్లు చేస్తు న్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన ల ప్రకారం, పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ వారు పాఠశాలలు మరియు హాస్టళ్లకు మధ్యాహ్న భోజనం మరియు సంక్షేమ పథకాల కింద 25 కిలోల సంచులలో నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు పౌరస రఫరాల శాఖగోడౌన్లో మన జిల్లాకు ప్యాకింగ్ యూనిట్గా M/s శ్రీ తిరుమల ఎంటర్ప్రైజెస్ను నియమించిందన్నారు
2024-25 ఖరీఫ్లో సేకరిం చిన 320 మెట్రిక్ టన్నుల FQR ను 25 కిలోల సంచులలో ప్యాకింగ్ చేయడానికి మా జిల్లాకు కేటాయించారన్నారు.ప్యాకింగ్ యూనిట్లో గుం టూరు జిల్లా నుండి అందుకున్న 50 కిలోల FQR ను 25 కిలోలుగా తిరిగి ప్యాక్ చేస్తారన్నారు మరియు ప్రతి ప్యాకెట్కు ఒక ప్రత్యేకమైన QR కోడ్ జత చేయబడుతుందని తద్వారా FQR బియ్యం నాణ్యత మరియు వాటి వివరాలను నిర్ధారిస్తుంద న్నారు.తిరుమల ఎంట ర్ప్రైజెస్ MDM కింద పాఠశాలలు మరియు హాస్టళ్లకు పంపిణీ చేయడానికి 25 కిలోల బరువున్న 9,694 ప్యాకె ట్లను విజయవంతం గా ప్యాక్ చేసిందన్నారు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 62 హాస్టళ్లలో 25 కిలోల నాణ్యమైన బియ్యం బియ్యం 2,473 ప్యాకెట్లు మరియు 1,534 పాఠ శాలల్లో 25 కిలోల నాణ్యమైన బియ్యం బియ్యం 7,221 ప్యాకెట్లు ఉన్నాయి, మొత్తం 9694 ప్యాకెట్లు MDM మరియు హాస్టళ్ల కింద పంపిణీ కోసం ఉంచబడ్డాయ న్నారు.
5) జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వారిచే వివిధ పథకాలలో చేప ట్టబడిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదిక.1. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన
లో 2 పనులు రూ. 13. 52 కోట్లు అంచనా విలువ తో చేపట్టి 16.12 KM పొడవుతో పూర్తికాబడి నవన్నారు, రూ. 11.29 కోట్లు ఖర్చు కాబడినద న్నారు SDMF పధకoలో 3 పనులు రూ. 4.40 కోట్లు అంచనా విలువతో చేపట్టి 7.30 K M పొడ వుతో పూర్తికాబడిన వన్నారు.నాబార్డ్ ద్వారా
12 పనులకు రూ. 20.43 కోట్లు అంచనా విలువతో 27.01 KM మంజూరు కాబడి టెండర్ దశలో ఉన్నాయన్నారు.
MGNREGS CC రోడ్ల
లో 1172 పనులు రూ. 100.01కోట్లు అంచనా
విలువతో మంజూరు అయినవనీ, 924 పనులు 121.2 KM పొడవుతో పూర్తికాబడి నవి, రూ. 55.27 కోట్లు ఖర్చు కాబడినదన్నారు.
MGNREGS BT రోడ్లు:-
పధకo లో 25 పనులు రూ. 9.57 కోట్లు అంచనా విలువతో మంజూరు అయినవి. 13 పనులు 6.39 KM పొడవుతో పూర్తికాబడినవి, రూ. 2.39 కోట్లు ఖర్చు కాబడినదన్నారు
MGNREGS WBM రోడ్లు:-ఈ పధకoలో 49 పనులు రూ. 9.79 కోట్లు అంచనా విలువతో మంజూరు అయినవనీ. 16 పనులు 10.33 KM పూర్తికాబడినవి, రూ. 1.82 కోట్లు ఖర్చు కాబడినదన్నారు.