
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 17:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచులను మే ఒకటో తేదీ నుండి ఇసుక త్రవ్వకాల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా ఇసుక కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం జిల్లా ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు ఇసుక కమిటీ అధ్యక్షులు ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్ నందు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గోపాలపురం జొన్నాడ అమలాపురం రావుల పాడులలో నూత నంగా ఇసుక స్టాక్ డిపోలు గుర్తించి ఆమోదించినట్లు తెలిపారు. టెండర్ అమలు కమిటీ ఉచిత ఇసుక పాలసీ నిబంధన లకు అనుగుణంగా నిర్వహించాలని ఈ కమిటీలో డిఆర్ఓ సభ్యులుగా ఉంటార న్నారు త్వరలో ఈ ఐదు సెమీ మెకానైజ్డ్ రీచులకు నోటి ఫికేషన్ జారీ చేసి టెండర్లు పిలిచి రానున్న మే ఒకటో తేదీ నుండి ఇసుక త్రవ్వకాలు నిర్వ హించి స్టాక్ యార్డు లకు తరలించేందుకు సన్నద్ధం కావాలన్నారు. జిల్లాలో పాత వంతెనలు భద్రత దృష్ట్యా అంతర్గత రహదారులు వెంబడి 20 మెట్రిక్ టన్ను లకు మించిన ఇసుక లోడుతో ప్రయాణించే లారీలు యాజ మాన్యాలపై కేసులు బనా యించాలని జిల్లా రవాణా అధికారిని ఆదేశించారు . నూతనంగా ఎంపిక చేసిన ఐదు సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్ లు కు సంబంధించి అప్రోచ్ రోడ్లు స్టాక్ యార్డుల మా ర్గాలను బలోపేతం చే యాలన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడి ఎల్ వంశీధర్ రెడ్డి, ఆర్డీవోలు పీ శ్రీకర్, కే మాధవి, ఆర్ అండ్ బి ఎస్ ఇ బి రాము ఆర్డబ్ల్యూఎస్ డీ ఈ పద్మనాభం, జి ఎస్ డబ్ల్యూ ఎస్ టెక్నికల్ కోఆర్డినేటర్ సువిజయ్, రియాల్టీ ఇన్స్పెక్టర్ టి సుజాత తదితరులు పాల్గొన్నారు