
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం జూలై 04:
ఏఎస్ఐ జంగా సత్యనారాయణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తల్లి జంగా విమల (85) శుక్రవారం ఉదయం అనారోగ్యం కారణం గా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ కన్నతల్లి దూరం అవటం వల్ల ఆయన కలవరంతో భావోద్వేగం చెందారు.శుక్రవారం మధ్యాహ్నానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.ఆయనకు ఉన్నత పోలీసు అధికారులు, క్రింద స్థాయి పోలీస్ అధికారులు ఆయనను పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.ఈ దుఃఖ సమయం లో కుటుంబ సభ్యులు మరియు V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ అందుబాటులో లేని కారణంగా ఫోన్ కాల్ ద్వారా పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చి సంతాపం ప్రకటించారు.