

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 07:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అయినవిల్లి మండలంలోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ నందు శనివారం ఉదయం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మండల మహిళా సమాఖ్య మరియు వెలుగు ఆధ్వర్యంలో యోగ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీడీవో జి సరోవర్ మాట్లాడుతూ యోగాతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు యోగ చేయటాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఉచిత యోగ శిక్షణలను నిర్వహిస్తున్నాయని, ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసిన డ్వాక్రా గ్రూపు మహిళలకు యోగ శిక్షణ కార్యక్రమం మాస్టర్ ట్రైనర్ ఎస్ విష్ణుకుమారి నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఏపిఎం ఎమ్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ భవాని, వివో ఏలు నాగమణి, నాగలక్ష్మి, నాగదుర్గ, ధనలక్ష్మి, భారతి, మల్లేశ్వరి, దుర్గ, అన్నపూర్ణ, జ్ఞానేశ్వరి,వెంకటేశ్వరరావు అధిక సంఖ్యలో డ్వాక్రా గ్రూపు మహిళలు పాల్గొన్నారు.
