ఉగ్రవాదంపై పోరులో అమెరికా పూర్తి మద్దతు మన దేశానికే : హరీష్ బాలయోగి

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి…

మా వివరణ అనంతరం కొలంబియా ప్రభుత్వం సోషల్ మీడియాలో పాకిస్థాన్ లో మరణించిన వారికి సంతాపం తెలిపిన పోస్ట్ ఉపసంహరణ : ఎంపీ హరీష్ బాలయోగి

ఉగ్రవాదం పై పోరులో అమెరికా సంయుక్త రాష్ట్రాల మద్దతు భారతదేశానికి ఉందని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు.అఖిల పక్ష బృందం ఉగ్రవాదం పై పోరులో దేశ వాణిని వినిపించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వాన్స్ తో భేటీలో ఈ విషయాన్ని ప్రకటించినట్లు చెప్పారు.ఆపరేషన్ సింధూర్ ను గూర్చి పూర్తిగా ప్రత్యక్షంగా వివరించడం జరిగిందన్నారు.ఎందుకు ఎదురు దాడి చేయాల్సి వచ్చిందో అక్కడి సెనేటర్స్ కు కూడా తెలిపినట్లు చెప్పారు.అమెరికా దేశ మద్దతు పూర్తిగా భారత దేశానికి ఉంటుందని డేవిడ్ వాన్స్ స్పష్టంగా తెలిపారని హరీష్ తెలిపారు.అలాగే కొలంబియా దేశం వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రతినిధులకు పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విధానాన్ని వివరించామని పహల్గాంలో 26 మందిని ఏ విధంగా పొట్టనపెట్టుకున్నారో వివరించామన్నారు.అనంతరం ఎదురు దాడి చేయాల్సిన పరిస్థితితులను తెలిపామన్నారు.కొలంబియా దేశ ప్రభుత్వం పాకిస్థాన్ లో మరణించిన వారికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన పోస్ట్ ను ఉపసంహరించుకుందని కొలంబియా దేశం మనకు మద్దతు అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.

Related Articles

ఎస్ యానం బీచ్ లో మొదలైన సందడి. సాండ్ బైక్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 12:ఎస్ యానం బీచ్ లో సందడి మొదలైంది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి యానం […]

ఎపి కి 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు

విశాఖలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించారు.కొత్త RTC బస్సులు ప్రారంభించిన రాంప్రసాద్‌రెడ్డి, మాట్లాడుతూ..త్వరలో ఏపీకి ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నాం అన్నారు.2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెచ్చే యోచనతో ముందుకి వెళ్తున్నాం తెలిపారు.కొత్త బస్సులతో […]

మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ ఇంటిపై దాడి నాయకులు విచారణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు ఫిబ్రవరి 02:కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం ఇంటి పై ఒక దుండగుడు దాడికి పాల్పడ్డారు. […]

జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ ఆహ్వానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: జూలై రెండో తేదీ బుధవారం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి ప్రతి జిల్లా అధికారి పూర్తి […]