V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు ఫిబ్రవరి 02:కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం ఇంటి పై ఒక దుండగుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ట్రాక్టర్ తో ముద్రగడ నివాసం గేటును ఢీ కొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న కారు వెనుక భాగం కూడా డ్యామేజ్ అయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ బయటకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పనివాళ్లు ఆ ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముద్రగడ అభిమానులు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ఆయన స్వగృహానికి వైసీపీ నాయకులు వంగా గీత, చెల్లుబోయిన వేణుగోపాల్, కురసాల కన్నబాబు , ద్వారపూడి చంద్రశేఖర్, జక్కంపూడి రాజా, తదితరులు చేరుకుని ఆయన పరామర్శించారు.