
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం,జనవరి 25,2025

జనవరి 26 ,ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణం నందు జిల్లా స్థాయి 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడును.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ రావిరాల మహేష్ కుమార్ ఐఏఎస్ వారి చే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరుగును. గం. 9.10 ని లకు సాంప్రదాయక కవాతు, 9.30 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ ఉపన్యాసం, 9.50 గంటలకు శకటముల ప్రదర్శన, 10.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.30 గంటల నుంచి జిల్లాలో వివిధ శాఖలలో విశిష్ట సేవలు అందించిన వారికి బహుమతుల ప్రధానం చేస్తారు.

ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మీడియా మిత్రులందరినీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ నుండి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అని ప్రకటించారు.