
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 04:
టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్.
వైసిపి గోబెల్స్ ప్రచారాన్ని మానుకూని నిర్మాణాత్మకంగా వ్యవహరించటం నేర్చుకోవాలని పి.గన్నవరం నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ తెలిపారు. జూన్ 4న వైసిపి ‘వెన్నుపోటు దినం’ గా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టటాన్ని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అంతమై డా.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే కృషిలో భాగస్వాములయిన ప్రతిఒక్కరిని ఆయన అభినందించారు. తమ విజ్ఞతతో వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ ను సాధించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.హత్యా రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వం స్థాపించబడిన ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోతుందని అన్నారు. వెన్నుపోటులు వైసిపికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.తమ నిరంకుశ వైఖరి కారణంగా జగన్ పార్టీ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిందని ఆరోపించారు.