కోనసీమలో 335 సమస్యలు //కలెక్టరేట్ లో ఆక్వా రైతులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 24:

అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని జిల్లా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధి కారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ రాజకుమారి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి మధుసూదన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ మూర్తి లు అర్జీదారుల నుండి సుమారుగా 335 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వివిధ స్థాయిలలో పర్యవేక్షిస్తోందని ఆ దిశగా నూటికి నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపుతూ వ్యవస్థ పనితీరు పట్ల అర్జీదా రులలో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో అర్జీదారునితో క్షుణ్ణంగా విచారించి తదుపరి తగు పరిష్కార మార్గాలు సకా లంలో చూపాలని సూచించారు.

గడువు దాటిన అర్జీలు లేకుండా అప్ర మత్తంగా అర్జీలను ఎవరి స్థాయిలో వారు పరి ష్కారానికి చర్యలు గైకొనాలని ఆదేశించారు మండల స్థాయిలోని సమస్యలను మండల స్థాయి టీఆర్ఎస్ కార్యక్రమం మాత్రమే సమర్పించి జిల్లా స్థాయి సమస్యలను మాత్రమే జిల్లా కేంద్రానికి పరిష్కా రం నిమిత్తం తీసుకుని రావాలని సూచించారు అర్జీల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ అదే అంశంపై మరల ఫిర్యాదు నమోదు కాకుండా మెలకువలు పాటించాలన్నారు.

దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి వినతులను సావధానంగా విని తగు పరిష్కార మార్గాలు వైద్యులు అధికారుల ద్వారా చూపారు ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఇ కృష్ణారెడ్డి పంచాయతీ రాజ్ ఎస్. ఇ రామకృ ష్ణారెడ్డి, డి సి హెచ్ ఎస్ కార్తీక్, డి ఎం అండ్ హెచ్ ఓ, దుర్గారా వు దొర, మత్స్యశాఖ జేడీ ఎన్ శ్రీనివాసరావు, డిఐపి ఆర్ఓ కె లక్ష్మీనారాయణ, ట్రాన్స్కో ఎస్ ఇ ఎస్ రాజబాబు వివిధ శాఖల కు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

అమలాపురం కలెక్టరేట్లో ఉద్యోగులకు కంటి వైద్య శిబిరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 22: సర్వేంద్రియానాo నయనం ప్రధానమని, అన్ని ఇంద్రి యాలలో కళ్ళు ప్రధానమై నవని కంటి ప్రాముఖ్యత ను గుర్తెరిగి ఎప్పటికప్పుడు వైద్య […]

నకిలీ ఏజెంట్ మోసం ఇండియాకు రప్పిస్తాం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అండగా ఉంది

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామానికి చెందిన పొన్నాడ మంగ కుమారుడైన పొన్నా డ కనకరాజును ఒక […]

ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర తీరం వెంబడి ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికి […]

కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్ర దాడులను అన్ని దేశాలు ఖండించాయి: హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 17: అఖిల పక్ష బృందాలు వెళ్లిన అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు తెలిపాయి… పాత్రికేయ సమావేశంలో వెల్లడించిన ఎంపీ హరీష్ బాలయోగి… […]