
విద్యార్థులను,యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది జగనే : టీ.ఎన్. ఎస్. ఎఫ్.రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జూన్ 04:

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులను,యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది వైసీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అని టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ ఆరోపించారు.అంబేద్కర్ విదేశీ విద్య పథకంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దోహదపడేలా నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన జగన్ పేదలు ఉన్నత చదువులు లేకుండా చేసి విద్యార్థుల జీవితానికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.పేద విద్యార్థులు డిగ్రీ అనంతరం చదివే పై చదువులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ఎత్తేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లేకుండా చేసిన జగన్ వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసింది జగన్ కాదా అని సునీల్ ప్రశ్నించారు.ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ నేడు వెన్నుపోటు దినం అంటూ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.జగన్ పాలనలో అన్ని వర్గాల వారికీ వెన్నుపోటు పొడిచిన జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారని నక్కా సునీల్ విమర్శించారు.