V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి జూన్ 03:

కక్షతోనే తుని రైలు ఘటనను మళ్లీ తెచ్చారు
-మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
కాపులపై చంద్రబాబు ఎందుకు కక్ష పెట్టుకున్నారు అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.న్యాయస్థానం కూడా కేసును కొట్టేసింది అన్నారు.పవన్ కల్యాణ్ కాపులను కాపాడతారా అంటూ హర్షకుమార్ విమర్శించారు.
ఒక్కోక సామాజిక వర్గాన్ని చంద్రబాబు మోసం చేస్తూ.. వస్తున్నారు. చివరికి దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడారు.
