గంజాయి ముద్దాయికి కోర్టు 14 రోజులు రిమైండ్:ఎస్సై రాజేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు డిసెంబర్ 29:
రాజోలు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ను మరో సారి పోలీస్ పై అధికారులు అభినందించారు. శనివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నున్నవారి బాడవ ఇసుక రీచ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారు అని తెలుసుకున్న రాజోలు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ హుటాహుటీన అక్కడకు చేరుకున్ని 545 గ్రాములు గంజాయి తో ఉన్న బొండాడ ప్రదిప్ (చింటూ) ను పట్టుకున్నారు. అతను విచారించగా ముద్ధాయి సొంత ఊరు తాటిపాక గుర్తించారు. గంజాయి ముద్దాయి ప్రదిప్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి రాజోలు జి ఎఫ్ సీఎం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమైండ్ విధించినట్లు రాజోలు పోలీసులు తెలిపారు.ఈ మధ్యకాలంలో
నే రాజోలు ఎస్సై రాజేష్ కుమార్ నకిలీ కరెన్సీ నోట్లు ముఠాను పట్టుకున్ని మంచి గుర్తింపు తెచ్చుకున్ని ఎస్పీ దృష్టిలో పడ్డారు. ఇప్పుడు గంజాయి కేసుతో మరోసారి ఎస్సై రాజేష్ కుమార్ మాదకద్రవ్యాలు విక్రయించకుండా ఉక్కు పాదం మోపుతున్న ఆయనను పోలీసు అధికారులతో పాటు రాజకీయ నాయకులు,ప్రజానీకం అభినందిస్తున్నారు.