
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే27:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం మండలం కమినిలంక గోదావరి ఘటన విషాద ఛాయలు ఆరక ముందే పి గన్నవరం మండలం నాగుల్లంక గ్రామ శివారు ఆచంట మండలం అయోధ్యలంక పంచాయితీ రావిలంక గోదావరిలో నాగుల్లంక గ్రామానికి చెందిన ముగ్గురు బాలుర గల్లంతైన విషయం కలచివేసిందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి అన్నారు. ఉన్నతాధికారులతో అఖిల పక్ష విదేశీ పర్యటనలో ఉన్న హరీష్ మాట్లాడుతూ గోదావరిలో స్నానానికి వెళ్లిన అయిదుగురులో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని, సానబోయిన సూర్యతేజ (12),నీతిపూడి పవన్ కుమార్ (15),కేతా ప్రవీణ్ (15) లు గల్లంతైన సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా చర్చిమన్నారు.గల్లంతైన వారి ఆచూకీ కోసం చేపట్టిన చర్యలు మరింత వేగం చేయాలని హరీష్ సూచించినట్లు తెలిపారు.గల్లంతైన బాలుర కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి ప్రదేశాలలో ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.