
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంబాజీపేట ఆగస్టు 15:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో దళిత (యస్సీ మాదిగ) యువకుడు నేదునూరి నాగరాజు ముందుకు పడి అక్కడ కక్కడే మరణించారు. ఈ విషయం ముక్కామల తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అద్యక్షులు ముషిణి మణికంఠ అను వారి ద్వారా మృతుడు నాగరాజు కడు దళిత పేదవాడని తండ్రిలేడని, వివాహం కావలసిన ఒక చెల్లెలు ఉన్నదని ఆ కుటుంభానికి మృతుడే ప్రధాన సంపాదనా పరుడనే విషయం తెలుసుకుని మృతిని ధహన సంస్కారాలకు కుడా ఆర్దిక ఇబ్బందులకు ఎదుర్కుంటున్నారని తెలిసి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మృతుని తల్లి సత్యవతి, చెల్లెలు మౌనిక, మృతుని మరో సోదరి దుర్గ ను పారామర్షించి దైర్యంగా ఉండమని చెప్పి తీవ్ర సంతాపం తెలియపర్చి అంతిమ సంస్కార కార్యక్రమానికి 15000 రూ.లు ఆర్దిక సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ గారి వెంట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గందం పల్లంరాజు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్ డి సభ్యుడు దళిత రత్న నేదునూరి వీర్రాజు, ఇండుగుల ఆనంద్ గారు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ దువ్వూరి సురేష్, ముషిని మణికంఠ, గ్రామశాఖ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.