సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం రూరల్, జూలై 22:

కూటమి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజలు మెచ్చే విధంగా రాష్ట్రంలో చంద్రన్న నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి సుభాష్ భీమక్రొసుపాలెం, ఉండూరు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మై టిడిపి యాప్ లో పొందుపరిచారు. తొలుత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉండూరు లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేస్తూ సమీపంలో ఉన్న అంగన్వాడి సెంటర్ కు వెళ్లి అక్కడ పిల్లలకు అందిస్తున్న చదువు, సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని, పింఛన్లు పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందించామని, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్న అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13 వేల రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశారని, త్వరలో మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ వెంట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు పెంకే సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీను, సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు, అమలాపురం పార్లమెంట్ కన్వీనర్ ప్రకాష్, ఆయా గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, బూత్, క్లస్టర్ ఇన్చార్జిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

రామచంద్రపురం లో గన్నవరపుకు బోస్ ఆశీస్సులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 28: పి.గన్నవరం పై జగన్ ప్రత్యేక దృష్టి: పిల్లి సుభాష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురంలో గన్నవరపు […]

అమలాపురం నడిబొడ్డులో ఉన్న రైతు బజార్ పున ప్రారంభించేందుకు చర్యలు: జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 28: నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నడిబొడ్డులో ఉన్న రైతు బజార్ పున ప్రారంభించేందుకు […]

నిరుద్యోగులకు హోంలో ఉద్యోగాలు మంత్రి శుభవార్త

నిరుద్యోగులకు ఎపి హోంమంత్రి అనిత శుభవార్త చెప్పారు. పోలీసు, జైళ్లు, న్యాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా శాఖలు సమర్థంగా పని చేసేందుకు కావాల్సిన […]