నేనే మండల అధ్యక్షుడిగా.. పుకార్లను నమ్మొద్దు మళ్ళీ సిఎం జగన్ మోహన్ రెడ్డే: కుడిపూడి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 26:

పుకార్లను నమ్మొద్దు అంటూ అయినవిల్లి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడిపూడి విద్యాసాగర్ వెల్లడించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, వైసీపీ మండల నాయకులు మరియు సర్పంచులు రాజీనామాలు అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పుకార్లు సృష్టించారు. ఈ ప్రసారానికి విసుగెత్తిన స్థానిక మండల వైసీపీ అధ్యక్షుడు స్వగృహం సిరిపల్లి గ్రామంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు సమక్షంలో పార్టీ మండల పెద్దలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో అధ్యక్షుడు కుడుపూడి విద్యాసాగర్ (జిజ్జి) మాట్లాడుతూ… నేను రాజీనామా చేస్తాను అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు వల్ల ఎంతో ముస్తాపానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే నా ప్రయాణం అన్నారు.

మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు అని, మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డే అన్నారు. అంతేకాకుండా అధిష్టానం తీర్మానం మేరకు నేను కట్టుబడి ఉండి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని సభాముఖంగా ఆయన వివరణ ఇచ్చారు. అదేవిధంగా మన మండలంలో గన్నవరపు సూర్యనారాయణ బిడ్డ గన్నవరపు శ్రీనివాసరావు కు నియోజకవర్గ సమన్వయకర్త గా నియమించడం గర్వంగా ఉందన్నారు. నా పూర్తి సహకారాలు గన్నవరపుకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయని రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్ సాక్షిగా శపథం చేశారు. ఇదేవిధంగా నేదునూరి సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, వెలవలపల్లి సర్పంచ్ బొంతు శ్రీనివాస్ తదితరులు రాజీనామాలకు వ్యతిరేకంగా మాట్లాడారు.మా బాట జగన్ మాట అనే నినాదాలతో సమావేశం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్టపర్తి రామారావు, గుత్తుల నాగబాబు మరియు స్థానిక మండలం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

ప్రాథమిక పాఠశాలలో ఇంటర్మీడియట్ అదనపు గదులు: ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం జనవరి 03: ఇంటర్మీడియట్ అదనపు గదులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]

ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను అందించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి

V9ప్రజా ఆయుధం రామచంద్రపురం , డిసెంబర్16,2024: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేటి ఆధ్వర్యంలో షర్మిల పుట్టినరోజు వేడుకలు

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పుట్టినరోజు వేడుకలు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం.నగరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి […]