V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 27:

నాగరికతకు భారతదేశం పెట్టింది పేరని, యోగా మన వారసత్వ సంపదని యోగా మెరుగైన జీవ నానికి మానసిక,శారీరక ప్రశాంతతకు ఉపకరి స్తుందని డాక్టర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళ వారం స్థానిక కలెక్టరేట్ నుండి గడియారం స్తంభం వరకు 11వ అంతర్జాతీ య యోగా దినోత్సవం పురస్కరించుకుని మాస్ ర్యాలీని స్థానిక జిల్లా స్థాయి అధికారులు ప్రజలు, డ్వాక్రా సంఘాల సభ్యు లు, ఉపాధి కూలీలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగంగా ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిం చారు యోగా అనేది ఏ కొద్దిమందికో లేక.. కొన్ని ప్రాంతాల కో సంబంధిం చినది కాదని అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని సూ చించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అన్నారు., ప్రతి ఒక్కరిలో ప్రగాఢమై న మార్పు తీసుకువచ్చే కార్యక్రమమన్నారు .

నెల రోజుల పాటు యోగాంధ్ర – 2025 పేరిట విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమోట్ చేస్తున్నాయని తెలిపారు. జిల్లా జాయిం ట్ కలెక్టర్ టీ నిషాoతి మాట్లాడుతూ సమాజం లో ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగాను ప్రమోట్ చేసేం దుకు కృషి చేయాలని కోరారు. యోగ కేవలం వ్యాయామం కాదని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక పురాతన అభ్యాసంగా ఉందన్నారు వేల సంవ త్సరాల చరిత్ర కలిగిన యోగా, ఆధునిక జీవనశై లిలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఒక అద్భుత మైనపరిష్కారం ఆసనాలనీ శరీరాన్ని సాగదీయడం ద్వారా కండరాలను బలోపేతం చేసి, శరీరానికి స్థిరత్వాన్ని, సమతుల్యతను అందిస్తుందన్నారు.

యోగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. సరైన జీర్ణక్రియకు సహాయ పడి,మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంద న్నారు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంద నీ, రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి తోడ్పడు తుందన్నారు యోగా రోగ నిరోధక శక్తిని పెంచి,శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుం దన్నారు.యోగ ఆరోగ్యక రమైన ఆహారపు అలవాట్లకు దారితీస్తుందన్నారు యోగా మానసిక ఒత్తిడిని, ఆందోళ నను తగ్గిస్తుందన్నారు.

యోగా నిరంతర సాధనతో మానసిక ప్రశాంతత కలిగిస్తూ భావోద్వేగాన్ని నియంత్రించి ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుతుందని. యోగా ఆత్మజ్ఞానం వైపు పయ నించడానికి ఒక మార్గమనీ మనస్సును, శరీరాన్ని, ఆత్మను ఏకం చేస్తుందన్నారు ఆధునిక పోటి జీవనశైలిలో, యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసు కోవాలన్నారు.

ఐటెం 2,: ప్రభుత్వ సాంఘిక వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహ పాఠశాలల్లో యోగ విద్యను (ఆనాపానం)అభ్యసింపజేసేందుకు స్వచ్ఛంద సంస్థల యో గా గురువుల ద్వారా కార్యా చరణను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా ఎస్ సి ,బి సి, సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల యోగ గురువుల తో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా విద్య ఆనాపానం జిల్లాలో ఉన్న 8 వసతి గృహ పాఠశాలల్లో యోగ విద్యను అభ్యసిస్తున్న సుమారు 3000 మందికి ఎనిమిది లొకేషన్లో ఉదయం సాయం త్రం యోగ ఆనాపా నం నేర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. సంక్షేమ వసతి గృహ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు విద్యార్థు లకు యోగావిద్యను అభ్యసింపజేసేందుకు యోగా గురువులు ఉదయం సాయం త్రం సెషన్స్ నిర్వహించి యోగ విద్యను పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో యోగ విద్యను ప్రారంభిం పజేసి జూలై నాటికి మొదటి సెషన్ పూర్తి చేయాలన్నారు తదుపరి యోగ గురువులు రెండు నెలలకు ఒకసారి యోగ విద్యను ఫాలో అప్ చేస్తూ పూర్తిస్థాయిలో ఆచర ణలోకి తీసుకునే విధంగా చర్యలు గైకొంటారన్నారు తద్వారా పాఠశాలల్లో శారీరక మానసిక ప్రశాంతత పట్ల పెద్ద మార్పు ప్రస్ఫుటంగా కనబడి విద్యాభ్యాసానికి ఎక్కువ సమయం వెచ్చించడం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో డిఆర్ఓ రాజకుమారి యోగా గురువులు అమర్ కిషోర్ భాస్కర్ కృష్ణవేణి మణికంఠ రమేష్ డిఇఓ షేక్ సలీం బాషా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు ఎల్డీఎం కేశవ వర్మ, డ్వామా పిడి మధు సూదన్ తదితరులు పాల్గొ న్నారు.