
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం మే27:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్,పి. గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామ శివారులో గోదావరి నది తీరాన మంగళవారం చోటు చేసుకున్న విషాదకర ఘటనలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ఆచంట మండలంలోని అయోధ్యలంక పంచాయతీ రావిలంక ప్రాంతం.

గల్లంతైన విద్యార్థుల వివరాలు:-
- కేతా ప్రవీణ్ (15)
- సానబోయిన సూర్యతేజ (12)
- నీతిపూడి పౌలు కుమార్ (15)

- ఈ ముగ్గురు విద్యార్థులు పి. గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామానికి చెందిన యువకులు. స్నానం చేయడానికి గోదావరి నదిలోకి వెళ్లారు, అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు అని సమాచారం. తోడు వచ్చిన ఇద్దరు బాలురు ఈ దృశ్యం చూసి భయంతో పరుగెత్తి, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
వారిని మర్చిపోలేని విషాదం కమ్మేసిన ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే తహసిల్దార్ పల్లవి, సీఐ భీమరాజు మరియు ఎస్సై శివకృష్ణ గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ సమయంలో అత్యంత పటిమగా, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచినవారు పి. గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన స్పందించారు, వ్యక్తిగతంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గొప్ప ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, రాత్రి వేళకైనా వెనుకాడకుండా బోటులోకి స్వయంగా ఎక్కి గాలింపు చర్యల్లో పాల్గొనడం గమనార్హం. ఇది కేవలం అధికారికంగా పరిస్థితిని సమీక్షించడం మాత్రమే కాక, ఒక తండ్రిలా బాధిత కుటుంబాలకు తోడుగా ఉండే నాయకత్వ లక్షణాలకు నిదర్శనం.అధికారులతో సమన్వయం చేస్తూ, అన్ని విధాలుగా సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో పూనుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. “ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులు దృష్టి సారించాలి,” అని సూచించారు.
