V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 30:

విధుల నిర్వహణలో మెరు గైన సేవలందించే అధికారు లకు ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు., బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు మామిడికుదురు మం డల తహసిల్దార్ ఎదురువాడ వెంకట సుబ్రహ్మణ్యాచారికి జిల్లా కలెక్టర్ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు, అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత విద్యా సముపార్థనతో ప్రభుత్వ కొలువు సాధించి ప్రభుత్వ పరిపాలనలో కీలక మైన రెవెన్యూ విభాగంలో అమూల్యమైన సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అత్యంత బాధ్యతగా సున్నిత మన స్తత్వం ఆత్మస్థైర్యం మంచి తనం సేవా గుణంతో విరామ మెరుగని సారధివై విజయా లకు మూల వారధిగా విలువలకు ప్రతిరూపమై 36 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసి పలువురు మన్ననలు పొందారన్నారు

విశ్రాంత జీవితం సుఖ సంతో షాలతో ఆయురా రోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. డిఆర్ఓ బి ఎల్ ఎన్ రాజకు మారి మాట్లాడుతూ ప్రభు త్వంలో బాధ్యతాయుతంగా ఉద్యోగంలో పనిచేసినప్పుడు జీవితంలో ఎంతో సంతృప్తిని కలుగ జేస్తుందన్నారు. విశ్రాం త జీవితం ఆయురారోగ్యాల తో సుఖ సంతోషంగా గడపా లని ఆమె ఆకాంక్షించారు.

పదవీ విరమణ పొందిన తాహసిల్దార్ సుబ్రహ్మణ్య చారి మాట్లాడుతూ1986 లో టైపిస్టుగా ఉద్యోగంలో ప్రవేశించి కృష్ణా జిల్లాలో సీనియర్ అసిస్టెంట్, ఉప తాహసిల్దార్ గా పనిచేసి 2018 సంవత్సరంలో పదో న్నతి పై రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల తాహసిల్దారుగా బాధ్యతలు స్వీకరిం చానన్నారు 2019 వ సంవత్సరంలో రంపచోడ వరం సబ్ కలెక్టర్ కార్యా లయంలో ఈవోగా పని చేశానని 2024 సంవత్సరం లో సాధారణ ఎన్నికల బదిలీల నేపథ్యంలో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి తాహసిల్దారుగా విధులు నిర్వర్తించానన్నారు.

సాధారణ ఎన్నికలు ముగిసిన అనంత రం బదిలీల్లో భాగంగా మా మిడికుదురు మండలానికి తాహసిల్దార్ గా రావడం జరిగిందన్నారు స్థానిక కలెక్టరేట్ నందు ఉద్యోగ పదవీ విరమణ పొందిన తాహసిల్దార్ ఎదురువాడ వెంకట సుబ్రహ్మణ్యచారి దంపతులను జిల్లా కలెక్టర్ డిఆర్ఓ మరియు ఏవో విశ్వేశ్వరరావు లు జ్ఞాపికలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.