


అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆనందరావు గారి మాటలు స్టేటస్ పెట్టుకుంటున్నాం: ఆటో యూనియన్ సత్తిరాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 04:

ఆటో డ్రైవర్లు కుటుంబాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని ఎమ్మెల్యే ఆనందరావు భరోసా ఇచ్చారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆటో, టాక్సీ, మెక్సి క్యాబ్, మోటర్ క్యాబ్ డ్రైవర్లకు జిల్లాలో 7,709 మంది లబ్ధిని పొందారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం అమలాపురం భట్నవిల్లి నందు ఆటో డ్రైవర్ల సేవలో ఆటో రిక్షా మ్యాక్స్ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం. నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేశారు.

కలెక్టర్ ప్రసంగిస్తూ జిల్లాలో భాగం గా స్థానిక ఆమలాపురం డివిజన్లోనే 1306 మందికి ఆటో ఇతర క్యాబ్ డ్రైవర్ల కు ఈ లబ్ది చేకూరిం దన్నారు. జిల్లా మొత్తంగా సుమారు 7709 మంది లబ్ధిదారులు కు ఒక్కొక్కరికి 15000 చొప్పున వారి ఎకౌంట్లకు జమ చేయడం జరిగిందన్నారు. స్థానిక అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి సహాయాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

అదేవిధంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్ సహకారంతో ఒకపక్క సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరోపక్క జిల్లాలోరెండు బ్రిడ్జిలు నిర్మించగలిగామని భవిష్యత్తులో కూడా మరిన్ని బ్రిడ్జిలు ఏర్పాటు చేసి అమలాపురంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకుల విజ్ఞప్తిల మేరకు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు మరియు ఆటో కార్మికుల విజ్ఞప్తిలను దృష్టిలో ఉంచుకొని వారికి సహకరిస్తామని తెలియజేశారు.

రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు ఎంతో శ్రమిస్తున్నారని ఆ దిశగా జిల్లా వివిధ స్థాయిలలో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు తమ తమ అభిప్రాయాలను సభాముఖంగా మాట్లాడుతూ… శాసనసభ్యులు ఆనందరావు గారు అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. ఎవరు ఏమనుకున్నా అభివృద్ధి చేసి చూపించే గొప్ప నాయకుడని పొగుడారు. కొత్త బ్రిడ్జిలు ద్వారా కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం తీరిందన్నారు.

మరో ఆరు బ్రిడ్జిలు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నిర్మిస్తే పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం తీరిందన్నారు.అంతేకాకుండా మా ఎమ్మెల్యే ఆనందరావు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు అన్నీ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటున్నామని సభా ముఖంగా తెలిపారు. ఆటో డ్రైవర్ కుటుంబాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కలెక్టరు కోరారు. యూనియన్ భవనానికి మూడు సెంట్లు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి,జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాసరావు,
ఎమ్మార్వో అశోక్ కుమార్,పార్టీ నాయకులు మెట్ల రమణబాబు, అల్లాడి స్వామి నాయుడు బోర్రా వెంకటేశ్వరరావు నాయుడు,పెచ్చెట్టి చంద్రమౌళి, పెచ్చెట్టి విజయలక్ష్మి,అధికారి జయలక్ష్మి,పాలమూరు ధర్మ పాల్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వాసంశెట్టి సత్తిరాజు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పె క్టర్లు ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.