
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – కపిలేశ్వరపురం ఏప్రిల్ 30:

ప్రజానీకానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్నా అంతే ముఖ్యమ ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు బుధవారం కపిలేశ్వరపురం మండల పరిధిలోని అంగర శ్రీ గణపతి చేనేత పారిశ్రామికుల సహ కార ఉత్పత్తి మరియు విక్రయ కేంద్రాన్ని ఆయన సందర్శించి వివిధ రకాల చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను క్షుణ్ణం గా పరిశీలించారు.

ఈ సంద ర్భంగా ఆయన వివిధ విభా గాలలో నూలు దగ్గర నుంచి చీరలు దుప్పట్లు తదితర వస్త్రాలు తయారీ వరకు వివిధ ప్రక్రియలపై సిబ్బంది ద్వారా తయారీ విధానాలను ఆరా తీస్తూ అన్ని విభాగాల ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీ మ జిల్లాలో అన్ని చేనేత సహకార సంఘాల లో తలమానికంగా నిలుస్తూ ఏడాదికి రెండు కోట్ల టర్నోవర్తో ఈ సంఘం నిలవడం అభి నందనీయమన్నారు చేనేత సహకార సంఘాలను ప్రభు త్వ పరంగా రాయితీ లతో ప్రోత్సహించడం జరుగు తుందన్నారు మానవాళికి చేనేత వస్త్రాలను ఇప్పటికీ సాంప్రదాయ బద్దంగా తయారుచేసి అందిస్తున్నారన్నారు.

చేనేత చీరలు మనదేశ సాంప్రదాయ వస్త్ర కళని గ్రామీణ ఆర్థికాభివృద్ధి లో చేనేత చీరల ఉత్పత్తి గతంలో కీలకంగా ఉండే దన్నారు. ప్రాంతాల వారీగా చేనేత చీరలను నేయడంలో వేరు వేరు స్వంత సాంప్ర దాయ శైలులను కలిగి ఉన్నా యన్నారు చేనేత చీరల నేత సాధారణంగా కుటుంబ వ్యాపారం, కుటీర పరి శ్రమలలో ఒకటిగా ఉన్నా యన్నారు చేనేత చీరలు పట్టు పత్తి దారాలతో నేత ప్రక్రియకు అనేక దశలు ఉన్నాయన్నారు సాంప్రదాయకంగా రంగు వేయడం జరుగుతోందన్నారు.

వారసత్వ వృత్తిని, కళను కాపాడుకునేం దుకు నేటి ఆధునిక పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారన్నారు చేనేత కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిల్లిపాదీ శ్రమించి మగ్గాలపై కళాత్మక వస్త్రాలు ప్రపంచాన్ని మెప్పిం చే వస్త్రాలు నేస్తున్నారన్నా రు. దేశంలో వ్యవసాయం తరువాత అధిక మందికి పూర్వపు రోజులలో ఉపాధిని కల్పించింది చేనేత రంగమే నన్నారు. కంటికి ఇంపైన రంగురం గుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వ సంపద దేశానికే గర్వకారణమన్నారు.

మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మరియు అగ్గిపెట్టిలో పట్టే చీరల తయారీ, మానవాళికి వస్త్రాన్ని అందించిన ఘనత నాగరికత,మన చేనేత రంగానికి ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి పెద్దిరాజు తాసిల్దార్ పి చిన్నారావు, ఇన్చార్జ్ ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ సొసైటీ ఇన్చార్జి కె గంగరాజు శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు, గుర్రపు రాజు మండల స్థాయి అధికా రులు పాల్గొన్నారు