రాజోలు లో మెగా జాబ్ మేళా – 37 కంపెనీలు1547 ఖాళీలు భర్తీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 02:

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వికాస సంస్థ మరియు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఎ1 సేవా సమితి రాజోలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల మే 6 వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువత ప్రగతి కోసం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు జాబ్ మేళా కు సంబంధించిన కంపెనీల వివరాలతో కూడిన గోడ కరపత్రాలను ఆయన స్థానిక కలెక్టరేట్లో శుక్ర వారం ఆవిష్కరించారు సుమారు 37 కంపెనీలు పాల్గొని 1,547 ఖాళీలను భర్తీ చేయుటకు ముఖా ముఖి ఇంటర్వ్యూ లు నిర్వహిం చి ఉద్యోగాల నిర్వహణకై అభ్యర్థులను ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున నిరుద్యోగు లకు గొప్ప అవకాశాన్ని కంపెనీలు కల్పించడం నిరుద్యోగ యువతీ యువకులు అదృష్టంగా భావించాల న్నారు ఈ కార్యక్రమంలో వికాస జిల్లా మేనేజర్ గోళ్ళ రమేష్ మాట్లాడు తూ రిజిస్ట్రేషన్ డెస్క్లు, ఇంట ర్వ్యూ గదులు, కంపెనీ బూత్లు, వెయిటింగ్ ఏరియాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అన్ని ఏర్పాట్లు ఎ 1 సేవా సమితి అద్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ సహకారంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని , రాజోలు శాసన సభ్యుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని రాజోలు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులం దరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచు కోవాలని, పదవతరగతి నుండీ పీజీ వరకు విద్యార్హత కలిగిన వారు 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డి.హరి శేషు,రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా చేట్ల రామారావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి. గన్నవరం సెప్టెంబర్ 21: అయినవిల్లి మండలం రావిగుంట చెరువు గ్రామానికి చెందిన చేట్ల రామారావు వైసీపీ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా […]

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి బండారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కొత్తపేట ఆగస్టు 16: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సర్దార్ గౌతు లచ్చన్న దేశానికి అందించిన సేవలు మరువలేనివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు […]