
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు–అమలాపురం ఏప్రిల్ 16:

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా పలు కార్యక్రమాలను వారి సంక్షేమానికి అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు దివ్యాంగులకు ఉపకరణాలను డిఆర్ఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల స్వతంత్రతను, చలన శీలలతను జీవన నాణ్యతను మెరుగు పరచడానికి విద్యను అభ్య సించేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయన్నారు ఉపకరణాల పంపిణీ ద్వారా వారికి అవసరమైన సహాయక పరికరాలను అందించడం శుభ పరిణామమన్నారు ఈ పంపిణీ జిల్లా సర్వ శిక్ష అభియాన్ విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కదలలేని వారికి వీల్ చైర్లను పంపిణీ చేశారు.

ఊతకర్రలు నడవడానికి సహాయ పడతాయని,చేతి కర్రలు బ్యాలెన్స్ మద్దతు కోసం, వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలు,దృష్టి లోపం ఉన్నవారికి. కంటి అద్దాలు,అంధుల చదవడం రాయడం కోసం బ్రెయిలీ లిపి స్లేట్ ,దివ్యాంగులకు చేతులు కాళ్లు అవయవాలు కోల్పోయిన కృత్రిమ అవయవాలు, చలన శీలతను పెంచడానికి మూడు చక్రాల వాహనాలు అంధులకు మార్గనిర్దేశం చేయడానికి అధునాతన స్టిక్స్ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డీఈవో షేక్ సలీం భాష, కలెక్టరేట్ ఏఓ కే కాశీ విశ్వేశ్వర రావు, కోఆర్డినేటర్లు ఎంబీబీ సత్యనారాయణ భీమారావు దివ్యాంగులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.