కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ శిల్పి కి ఘన నివాళి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, ఏప్రిల్ 14,2025

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక భావజాలమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు గోదావరి భవన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతర అధికారులతో కలిసి అంబేద్కర్ , మహాత్మా గాంధీ విగ్రహాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి భవన్ లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. అంబేద్కర్ శక్తివంతులకు వ్యతిరేకంగా ధైర్యంగా స్వరం వినిపించిన సంఘసంస్కర్త అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత, ఆలోచన లేకుండా ఎవరిని అనుసరించకుండా ఆలోచించి పరిశీలించి సత్యాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అంబేద్కర్ గారి జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు.

విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. అంబేద్కర్ పాశ్చాత్య దేశాల రాజ్యాంగాలను సవివరంగా అధ్యయనం చేసి భారతదేశ ప్రత్యేకతలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి మన దేశం లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అణువుగా రూపొందించారని కలెక్టర్ గుర్తు చేశారు. దేశంలో ఎలక్షన్లు ఎలా నిర్వహించాలి..? న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు దేశానికి ఎలా మేలు చేయగలవు అనే అంశాలలో విస్తృతంగా పరిశోధనలు చేసి రాజ్యాంగంలో రూపొందించడానికి మార్గదర్శకత్వం వహించారన్నారు. అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన ఒక భావజాలం అని కలెక్టర్ తెలిపారు. ఆయన చూపిన సమానత్వం, విద్య, స్వీయ గౌరవ మార్గం ఈరోజు ప్రతి భారతీయుడు జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల మూలంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య ,ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించడం జరిగి కోట్లాదిమంది జీవితాలలో వెలుగును నింపగలిగామన్నారు. అంబేద్కర్ ఒక జాతికి మాత్రమే నాయకుడు కాదని.. జాతీయ నాయకుడని కలెక్టర్ పునరుద్ఘాటించారు.

జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి మాట్లాడుతూ..
అంబేద్కర్ జీవితం ఒక వ్యక్తిగత గాధ మాత్రమే కాదని కోట్లాదిమంది శోషితుల ఆశ, నమ్మకం, మార్గదర్శనమని ..అణగారిన వర్గాల పక్షాన నిలుచున్న మహోన్నతమైన వ్యక్తిని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అంబేద్కర్ సేవలు కేవలం రాజ్యాంగ రూపకల్పన వరకే పరిమితం అవ్వలేదని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటలో 1934 లో హిల్టన్ యంగ్ కమిషన్లో ఆయన ఇచ్చిన ఆర్థిక సిఫారసులు కీలక పాత్ర వహించాయన్నారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటుకు ముందు నుంచే ఆర్థిక ప్రణాళికలపై తన సుదీర్ఘ దృష్టితో దేశానికి దారి దీపంగా నిలిచారన్నారు. దేశ పార్లమెంటులో మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్ ను ప్రవేశపెట్టారన్నారు. హిందూ కోడ్ బిల్ద్ ద్వారా వివాహ, వారసత్వం, స్వతంత్ర జీవన హక్కుల్లో సమానత్వాన్ని చట్టబద్ధం చేయడంలో ఆయన చూపిన మార్గం ఈనాటికి ప్రాధాన్యత కోల్పోలేదు అన్నారు. అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యధికంగా చదువుకున్న భారతీయుల్లో ఒకరని.. కొలంబియా యూనివర్సిటీ లో పీహెచ్డీ చేసారని గుర్తు చేశారు. విద్యే శక్తి, విద్యే విముక్తి అనే ఆయన చెప్పిన మాటలు యువతకు మార్గదర్శకం కావాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బివిఎన్ఎల్ రాజకుమారి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జ్యోతిలక్ష్మి దేవి, జంగా బాబురావు, భీమ్రావు, దగ్గుపట్ల రవిబాబు, దళిత సంఘాల నాయకులు, జిల్లా అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం: మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 31:విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని,మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ […]

దళిత యువకుడిపై దాడి అమానుషం:

తమ రాజకీయ కుల దురహంకారంతోనే మండలంలోని వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు దోనిపాటి మహేశ్వరరావుపై దాడి జరిగినట్లు మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ తెలిపారు.ఈ విషయమై మానవ హక్కుల వేదిక […]

జోగేష్ కవిత్వంలో సౌందర్యదృష్టి,సామాజిక వాస్తవికత.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, 4 అక్టోబర్ 2025: స్వీయానుభూతితో, సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేష్రాసిన కవిత్వంలో సౌందర్యదృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఎరుకతోనే […]

కాస్సేపటికి జైలు నుండి రైతులు విడుదల

కాసేపట్లో జైలు నుంచి లగచర్ల రైతుల విడుదలరాత్రి జైలు అధికారులకు బెయిల్‌ పేపర్లు అందజేత16 మంది రైతులను విడుదల చేయనున్న అధికారులు