
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఏప్రిల్ 11:
అయినవిల్లి తహసిల్దార్ నాగలక్ష్మమ్మ లంక ప్రాంత ప్రజలకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామంలో పకృతి పరమైన ఇబ్బందులు వరదలు మరియు తుఫానులు ఎదుర్కొనేందుకు స్థానిక ఎమ్మార్వో నాగలక్షమ్మ అవగాహన కల్పిస్తూ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ .. శనివారం గ్రామపంచాయతీ వద్ద కొత్తపేట డివిజన్ రెవిన్యూ అధికారి అధ్యక్షతన ఆల్ డిపార్ట్మెంట్ సిబ్బందితో నిర్వహిస్తున్న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాన్ని కి గ్రామ లో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.