
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 11:

బడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మ జ్యోతిభా పూలే ఎందరికో స్ఫూర్తి ప్రదా తగా నిలిచారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నా రు. శుక్రవారం జ్యోతిభా ఫూలే 199వ జయంతిని జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహించారు.

మహాత్మ జ్యోతిభా పూలే జయంతిని పురస్కరించుకుని పూలే చిత్ర పటానికి పూలమాలలు అలంక రించి పుష్పగుచ్చాలతో జిల్లా కలెక్టర్ నివాళుల ర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రక్షణ అభ్యున్నతికి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్ర మాలన్నింటికీ జ్యోతిభా పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలే ఆదర్శాలన్నారు. సామా జిక రుగ్మతలను వెనుక బాటుతనాన్ని రూపు మాపే ఉద్యమానికి నాంది పలికిన జ్యోతి భా పూలే ఎందరో సంస్కర్తల కు మార్గదర్శకులుగా నిలిచారన్నారు.

సమాజం లో జరుగుతున్న అకృ త్యాలను దోపిడీలను ఎదిరించి విద్య ద్వారా పీడిత వర్గాలలో ఆత్మ గౌరవం కోసం పోరాట జ్వాలను రగిలించారన్నా రు. రెండు శతాబ్దాలు క్రితం జన్మించిన పూలే గురించి నేటికీ చిరస్మర ణీయుడుగా బలహీన వర్గాల అభ్యున్నతికి కలిపిన కృషికి నిదర్శ నంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటు న్నామన్నారు.

మహిళా విద్యతో అభ్యుదయ పదం వైపు మహిళ లను నడిపించి జ్యోతిభా పూలే నవ సమాజ నిర్మాతగా పేరొoదారన్నారు భారతీయ సామాజిక కార్యకర్తగా, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త , రచయితగా అంటరా నితనం కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కుల ప్రజలను విద్యావంతులను చేయడం ద్వారా భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శ కులు గా నిలిచారన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రసంగిస్తూ ఆది సంస్కర్త పూలే ఆలోచ నలు వర్తమాన సమాజం లో అణగారిన వర్గాలలో స్ఫూర్తిని రగిలి స్తున్నాయ న్నారు. సామాజిక చరిత్ర కలిగిన పూలే సామాజిక పునర్నిర్మాణ వేత్తగా స ముచిత స్థానం ఉందని సమాజంలో అసమానత లు బానిసత్వాన్ని శ్రామికుల దుర్భర స్థితిని పూలే ఎలుగెత్తి చాటార న్నారు పీడత జన బాంధ వుడుగా సామాజిక తత్వ వేత్తగా ఉద్యమ కారులు గా సంస్కరణ వాదిగా సామాజిక సేవ తప్పరు నిగా దీన జన బాంధ వునిగా లింగ వివక్షతకు వ్యతిరేకిగా అణగారిన వర్గాల హృద యాలలో చిరస్థాయిగా నిలిచార న్నారు రాజ్యసభ సభ్యు లు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ప్రసంగిస్తూ నానా జాతుల జీవన స్థితిగతు లు గమనసీలిగా కుట్ర జాతీయవాదాన్ని భగ్నం చేసిన రచన శీలిగా, విప్లవ యోధుడిగా పేరుగాంచారన్నారు

అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం. అణ గారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులని, సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించి స్త్రీలు విద్యావం తులు కావాలని నమ్మిన వ్యక్తన్నారు. జిల్లా జా యింట్ కలెక్టర్ టి నిశాంతి ప్రసంగిస్తూ మానవ హక్కులు ఉల్లంఘనకు గురికా కుండా సమ సమాజ స్థాపన కోసం అలుపెరు గని పోరాటం చేసిన మహాయోధు డన్నారు. సమాజాన్ని అధ్యయనం చేసి జ్ఞానా న్ని సము పార్జించిన మహనీయుడన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవి తాన్ని అంకితం చేశాడని ఆయన సేవలను కొని యాడారు. ఆధునిక భారత దేశంలో మొదటి సామాజిక ఉద్యమకా రుడు గొప్ప సంస్కర్త అయిన జ్యోతి భా పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గురువుగా భావించారన్నారు.

అందరికీ సమాన హక్కుల సాధన వంటి లక్ష్యాలతో సత్యశోధక్ సమాజ్ ద్వారా విస్తృత ప్రచారం గావించారన్నా రు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందిం చడం ద్వారా పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహ నీయుల ఆశయాలను, భావజాలాన్ని ప్రభుత్వా లు నెరవేరుస్తున్నాయ న్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, కే సూర్య నారాయణ రావుజిల్లా స్థాయి అధికారులు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్. తదితరులు పా ల్గొ న్నారు