V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 07:

వ్యవసాయ సాగుకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ డ్రోన్ టెక్నాలజీతో అన్న దాతకు ఆసరాగా నిలవాలని ప్రభుత్వం దృష్టిసారించి ఆదిశగా చర్యలు వేగవంతం చేసిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు సోమవారం స్థానిక కలెక్టరేట్లో అభ్యుదయ రైతులు డ్వాక్రా సంఘాల సభ్యులు వ్యవసాయ డిగ్రీ పొందిన విద్యార్థులు మూడు కేటగిరీలలో 134 మందికి కర్నూలు ట్రిపుల్ ఐ టీ డిజైన్ అండ్ మ్యా ను ఫ్యాక్చరింగ్ సాంకేతిక ప్రతినిధులు కృష్ణ నాయక్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఈనెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు చేపట్టనున్న వ్యవసాయ రంగంలో డ్రోన్లు వినియోగంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొ దటిసారిగా కోనసీమ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి శిక్షణ కార్యక్రమా నికి శ్రీకారం చుట్టామన్నారు. వ్యవసాయం పనులు మరింత సులువుగా చేపట్టేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు మూడు నెలల క్రితమే ప్రోగ్రాం డిజైన్ చేశామని తెలిపారు మండ లానికి ఆరుగురు చొప్పున శిక్షణ కొరకు ఎంపిక చేసినట్లు తెలి పారు ముందుగా వ్యవ సాయ సాగు క్షేత్రాలను ఆశిం చిన క్రిమి కీటకాలను ఈ డ్రోన్లు ఫ్లయింగ్ కెమెరాల ద్వారా గుర్తించి విశ్లేషించడం జరుగుతుందని తదుపరి వాటి నివారణ కొరకు పురు గుల మందులు డ్రోన్లద్వారా సులభతరంగా పిచికారి చేయడం జరుగుతుందన్నారు.

వ్యవసాయ రంగంలో ఖర్చు లు తగ్గించుకునేందుకు డ్రోన్ల వినియోగం పెంచుకోవలసిన ఆవశ్యకత ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టింద న్నారు మానవ వనరుల లభ్యత తగ్గటం కూలీల ధరలు అమాంతంగా పెర గడంతో ఎకరా పొలం లో క్రిమిసంహారక మందులు, ఎరువుల పిచికారీకి అవుతున్న ఖర్చు అక్ష రాలా రూ.2 వేలు అదే డ్రోన్ల ద్వారా అయితే డబ్బులు ఆదా అవడం తో పాటుగా సమయం కూడాకలిసి వస్తుందన్నారు. వ్యవ సాయంలో డ్రోన్ల తయారీ, వినియోగం ఫ్లయింగ్ వంటి అంశాల లో ఐదు రోజులు పాటు క్షుణ్ణంగా తరిఫీదును ఇస్తారన్నారు శిక్షణ అనం తరం సర్టిఫికెట్లు జారీ చేస్తా రన్నారు తదుపరి డ్రోన్ పైలెట్ లైసెన్సులు జారీ చేస్తారన్నారు ఈ డ్రోన్ ఖరీదు రూ. 1,80,0 00 వరకు ఉంటుందన్నా రు తొలుతగా స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు ప్రయోగాత్మకంగా డ్రోన్ ఫ్లయింగ్ విధానాలపై అవగాహన పెంపొందించి తదుపరి వ్యవసాయ క్షేత్రంలో అవగాహన కల్పిస్తారన్నారు. వీటిపై బేసిక్ స్థితిగతులు ఆపరేటింగ్ విధి విధానాలపై క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని ఎటువంటి సందేహాలు ఉన్న బృంద సభ్యుల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో వీటి వినియోగం ద్వారా ప్రయోజ నాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవ సాయంలో డ్రోన్లు తనదైన ముద్ర వేస్తున్నాయని
ప్రధానంగా మానవ వనరుల కొరతతో కొందరు రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారన్నారు పంటలపై ఆశించే పురు గులు, తెగుళ్ల నివారణకు పిచికారీ చేసే మందులను వాటి ద్వారా స్ప్రే చేస్తే తక్కువ ఖర్చు, సమయం ఆదా అవుతుందన్నారు డ్రోన్ సాంకేతిక నిపుణులు కృష్ణ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కోనసీమ జిల్లాలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారం భించడం జరిగిందని డ్రోన్ తయారీ ఎగురవేసే విధానం పై శిక్షణ ఉంటుందన్నారు. డి ఆర్ డి ఎ, పి డి సాయినాథ్ జై చంద్ర గాంధీ మాట్లాడుతూ తొలి దశలో 8 డ్రోన్లను జిల్లా సమాఖ్య నిధుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా సమాఖ్యల ఆధ్వర్యంలో వీటిని శిక్షణ పొందిన డ్వాక్రా సంఘాల ప్రతినిధులతో వినియోగించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసు బాబు డిపిఎం గణపతి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
