శుక్రవారం ఆ జిల్లాలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నేడు(శుక్రవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.