

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 16:

చైర్మన్ యెల్లమెల్లి విజయ్ ఆధ్వర్యంలో పుస్తకాలు కిట్లు పంపిణీ జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ యెల్లమెల్లి విజయ్ ఆధ్వర్యంలో స్థానిక మాజీ సర్పంచ్ కొరిపల్లి రమాదేవి శ్రీనివాస్ చౌదరి సమక్షంలో సోమవారం ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ… విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గ్రామంలో మంచి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిల్లలందరూ పాఠశాలలో చదువుకోవాలని ఉద్దేశంతో స్కూల్స్ తెరిసిన వెంటనే పుస్తకాలు కంపెనీకి శ్రీకారం చుట్టారు. సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.