అమలాపురంలో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్@ కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 11:

స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక విదేశాలకు వలస వెళ్లి తమ కుటుంబాలను పోషించుకోదలచిన వారికి అన్ని విధా ల సౌకర్యవంతమైన చట్టబద్ధంగా మార్గ నిర్దేశం చేసేందుకు స్థానిక కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ (కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ ను ఆయన జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీవోలు కె మాధవి, పి శ్రీకర్, డి అఖిల లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుండి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాదులు పొందాలనుకునేవారికి అన్ని విధాల చట్టబద్ధంగా విదేశాలలో ఉన్న అవకాశాలు పాస్ పోర్టు వీసాలు పొందేందుకు గల మార్గాలను సూచించడంతోపాటు అన్ని విధాల గైడెన్స్ ఇస్తూ ఎటువంటి మోసాలకు గురికాకుండా సురక్షితంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కేంద్రం ఒక వరంగా నిలుస్తుందన్నారు. విదేశాలకు వెల్లదలచిన వారు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారు మరల తిరిగి వెళ్ళేందుకు ఈ కేంద్రం తగిన చట్టబద్ధత కలిగిన సహకారాన్ని సలహాలను అందిస్తుందన్నారు. గతంలో ఏజెంట్లు సంస్థలు తరపున విదేశాలకు వెళ్లి ముందుగా సూచించిన ఉద్యోగం కాకుండా వెట్టి చాకిరీ పనులకు నియమించడం జరిగేదని అదే విధంగా సందర్శన వీసాలతో ఏజెంట్లు పంపుతూ పలు మోసాలకు పాల్పడే వారిని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఈ కేంద్రాన్ని స్థానికంగా ఆరుగురు సిబ్బందితో పూర్తి సమాచారాన్ని సపోర్ట్ ను అందించే విధంగా నెలకొల్పడం జరిగిందన్నారు. ఇకపై విదేశాలకు వెళ్లదలచినవారు తప్పనిసరిగా ఈ కేంద్రాన్ని ఆశ్రయించి చట్టబద్ధంగా విదేశాలు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను ఉద్యోగాలను పొందేందుకు మార్గనిర్దేశం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త గోళ్ళ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

ఘోర అగ్ని ప్రమాదం

రాజస్థాన్‌ జయపురలో ఘోర ప్రమాదంగ్యాస్ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలుఆరుగురు మృతి, పలువురికి గాయాలుఅగ్నిప్రమాద ఘటనలో 40కిపైగా వాహనాలు దగ్ధం

అంగన్వాడి పట్ల ఐసిడిఎస్, సిడిపివోలు ఎంఈఓలు పూర్తి సమన్వయం వహించాలి జిల్లా మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25: అంగన్వాడి కేంద్రాలలో పూర్వపు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రైవేట్ […]

క్రిస్మస్‌ వాటికన్ సిటీ నుంచి పోప్‌ సందేశం

క్రిస్మస్‌ సందర్భంగా వాటికన్ పోప్‌ సందేశం ఆయుధాలను పక్కన పెట్టాలి. బుధవారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 25, 2024న వాటికన్ సిటీ నుంచి పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్, ఆఫ్రికా […]

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్ :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తో […]