V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఏలూరు మార్చి 03: ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కౌంటర్ పలితాలు పై ఉత్కంఠ నెలకొంది.ఏలూరు సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కౌంటర్ ప్రక్రియ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 700 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 27న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు లక్షల 18 వేల మంది పైగా పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 28 టేబుల్స్ 17 రౌండ్స్ తో ఈ కౌంటింగ్ జరుగుతుంది. ముందుగా బ్యాలెట్ బాక్స్ లో ఉన్న ఓటు పేపర్లను 20 నుంచి 50 వరకు కట్టల కట్టలుగా కడుతున్నారు. అదనపు ఎస్పి సూర్యచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు భారీ గా మోహరించారు. మూడు అంచులు పద్ధతి తో రెండు షిఫ్టులు మీద 450 మంది పోలీసులు అక్కడ పనిచేస్తున్నారు. ఇతరులు ఎవ్వరికి లోపలకు అనుమతి లేదని కేవలం ఏజెంట్లు కు మాత్రమే అనుమతు ఉందని పోలీసులు చెబుతున్నారు. ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం, పిడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య గట్టి పోటీ ఉంది. అదేవిధంగా అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు జీవి సుందరం పోటీలో ఉన్నారు. అయితే వారా హోరీగా పిడిఎఫ్ అభ్యర్థి మరియు కుటమి అభ్యర్థి మధ్య పోటీ కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కౌంటర్ పలితాలు పై ఉత్కంఠ
March 3, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ముద్రగడ నివాసంపై దాడి ఖండించిన తుమ్మలపల్లి రమేష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కాకినాడ ఫిబ్రవరి 02:ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది.ముద్రగడ అంటే పవన్‌కు,పార్టీ నేతలకు అపారమైన గౌరవం ఉందని ,దాడితో జనసేన పార్టీ కు […]
సంక్షేమ వసతి గృహాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 02: సంక్షేమ వసతి గృహాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి పథకంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణంగా అందించాలని ఆహార భద్రత […]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాల్లో న్యాయ విభాగం నియామక పరీక్షలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమహేంద్రవరం ఆగస్టు19: హజరు కానున్న 25,173 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – ఆగస్ట్ 20వ తేదీ నుండి 24 వరకూ టైపిస్ట్, […]
ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావం దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది కలెక్టర్ ఆర్ మహేష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 18: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావంపై దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని […]