సంక్షేమ వసతి గృహాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 02:

సంక్షేమ వసతి గృహాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి పథకంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణంగా అందించాలని ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం కలెక్టరేట్ నందు ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి, మరొక సభ్యులు జక్కం పూడి కృష్ణ కిరణ్ జిల్లా సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులు తూనికలు కొలతలు ఫుడ్ సెక్యూరిటీ అధికారులతో సమావేశం నిర్వహించి నాణ్యమైన పోషక ఆహా రాన్నిలక్షీత వర్గాలకు సంతృప్తికరంగా అందిం చాలని సూచించారు.

ఆహార భద్రత కమిషన్ ప్రజలకు వసతి గృహాల విద్యార్థినీ విద్యార్థులకు ఆహార భద్రతను కల్పిస్తూ పోషకాహారాన్ని అందించే లా పర్యవేక్షణ కొరకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ అన్నారు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కమిషన్ పనిచేస్తుందన్నారు ప్రభు త్వ పథకాలను సమర్థ వంతంగా అమలు చేస్తూ, ప్రజల అర్హతలకు అనుగు ణంగా పూర్తి స్థాయిలో లబ్దిని అందించేలా కృషి చేస్తుందన్నారు. ఆహార భద్రత కమిషన్ తనిఖీలు ప్రధానంగా ఆహార భద్ర తా ప్రమాణాలు, పోషకా హార పథకాల అమలు ను పర్యవేక్షిస్తాయన్నా రు. ఈ తనిఖీలలో ఆహా ర నాణ్యత ,రేషన్ దుకా ణాలు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు వంటి ప్రదేశా లలో పంపిణీ చేయబడు తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తాయన్నారు.

బియ్యం, పప్పులు, గుడ్లు, వంట నూనె వంటి నిత్యావ సరాల నాణ్యత ను పరిశీలన చేస్తామన్నారు ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానం, వంట శాలలు, స్టోర్ రూమ్ల పరిశుభ్రతను తనిఖీ చేయడం జరుగుతుంద న్నారు. లబ్ధిదారులకు అందాల్సిన ఆహార పదా ర్థాలు సరైన పరిమాణం లో సకాలంలో అందుతు న్నాయో లేదో కమీషన్ పరిశీలిస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ పథకాలు వంటి ప్రభుత్వ ఆహార,పోషకాహార పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయో తనిఖీలు నిర్వహించడం జరుగుతుం దన్నారు. తనిఖీలలో ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుం దని అవసరమైతే బాధ్యు లపై చర్యలు తీసుకోవాల ని సిఫార్సులు కూడా కమి టీ చేస్తుందన్నారు.ఫుడ్ కమిషన్ చైర్మన్ లేదా సభ్యులు ఆకస్మి కంగా తనిఖీలు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఈ కమిషన్ కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉన్నా యని లోపాలు గుర్తించినప్పు డు పూర్తి స్థాయిలో విచారణ చేస్తారని తెలిపారు. కమిషన్ మరో సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ మాట్లాడుతూ అధికారులు తమకు నిర్దేశిం చిన విధులు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో లక్షిత వర్గాల వారి పోషకాహార స్థాయిలను మెరుగుపర చడంలో పారదర్శకంగా అంకిత భావంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. తనిఖీలలో గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు అవకాశాన్ని ఇస్తున్నామని తప్పనిసరిగా ఆ యొక్క లోపాలను వెంటనే సరిది ద్దాలని ఆయన స్పష్టం చేశారు సమావేశం అనంతరం వసతి గృహాల ఆకస్మిక తనిఖీలకు బృంద సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్, సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు, ఐసిడిఎస్ పిడి శాంతకుమారి, సిడిపిఓలు, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, అసిస్టెంట్ సప్లై అధికారి శరత్, బాలాజీ తూనికలు కొలతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయి తెలుసు కోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక అమలాపురం నవంబరు 22: *విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల* *స్థాయి తెలుసు కోవాలి* విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయిని తెలుసు కునేందుకు […]

ముస్లిం అబ్బాయి రజనీకాంత్ కుమారుడిగా అంగీకరించారు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఆంధ్రప్రదేశ్ జూన్ 01: సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు మహ్మద్ యాసిన్ అనే […]

ఆంధ్రప్రదేశ్ లో 1,289 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ :డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో 1,289 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) 603, నాన్ క్లినికల్ 590, సూపర్ స్పెషాలిటీ 96 పోస్టులకు […]

దిండి గ్రామంలో ఎంపీ హరీష్ బాలయోగి,ఎమ్మెల్సీ రాజశేఖర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 09: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు […]