ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావం దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది కలెక్టర్ ఆర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 18:

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావంపై దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.

జూలై ఒకటో తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో పొగాకు వ్యతిరేకతపై విద్యార్థులకు అవగాహన కల్పించి సంతకాలు సేకరిం చినందుకు గాను ప్రతి మండలానికి ముగ్గురు విద్యార్థులకు ప్రోత్సాహంగా బ్యాగు లను సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు హృదయ సంబంధ వ్యాధులకు ఎలా దారి తీస్తుందో అవగాహన కల్పించి పొగాకు వాడకాన్ని మానేయాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయడం పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం’ పొగాకు వాడకానికి వ్యతి రేకంగా సంతకాల ప్రచా రంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు పాల్గొని వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సంతకాలు చేశారన్నారు.

పొగాకు వ్యతిరేక సంతకం ప్రచారం అంటే, పొగాకు వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ సంతకాలు చేసి తమ మద్దతును తెలిపే ఒక వినూత్న ప్రచార కార్యక్రమమన్నారు.పొగాకు వ్యతిరేక సంతకం ప్రచారం, పొగాకు వాడకం వల్ల కలిగే హాని గురించి ప్రజలకు అవ గాహన కల్పించి పొగాకు వాడకాన్ని నిరోధించాలన్నా రు.

ఈ సంతకాలు ప్రభు త్వాలకు, ఆరోగ్య సంస్థలకు పంపబడతాయని తద్వారా పొగాకు నియంత్రణ చర్యల కు మద్దతు లభిస్తుందన్నా రు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి పొగాకు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడానికి అనేక కార్యక్ర మాలు చేపట్టారన్నారు.

ఈ ప్రచారాలు పొగాకు వ్యతిరే క ఉద్యమానికి బలం చేకూరుస్తాయనీ, పొగాకు రహిత సమాజాన్ని నిర్మిం చడంలో సహాయ పడతా యన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు దొర,ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం సుమలత ఎన్ టి ఎన్ టి సి పి సోషల్ వర్కర్ కే ప్రమీల తదితరులు పాల్గొ న్నారు.

Related Articles

సోమవారం అమలాపురం ప్రజా వేదిక !1100 నెంబర్ కు కాల్ చేయవచ్చు కలెక్టరేట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 28; ఈనెల 29 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార […]

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలి: అయినవిల్లి మండలం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 06:అయినవిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసురావు అద్యక్షతన గురువారం ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల శాసనమండలి అభ్యర్ది పేరాబత్తుల […]