ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు- ఏలూరు మార్చి 04 :
గెలుపు దిశగా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందు వరుసలో ఉన్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఐదో రౌండ్ నాటికి మొత్తం 1,40,000 ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందులో చెల్లుబాటు అయినవి 1,27,907 కాగా, 12,093 చెల్లనివిగా ఉన్నాయి.
ఐదో రౌండ్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 15,632 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు ఆయనకు మొత్తంగా 80,037 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్లో పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకి 6,413 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఓట్లు 29,665కు చేరాయి. ఐదో రౌండ్లో 25,671 ఓట్లు చెల్లుబాటు కాగా.. చెల్లనివి 2,329గా అధికారులు గుర్తించారు. ఈ రౌండ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థి రాజశేఖరం 50,372 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.మరి కొన్ని గంటల్లో ఫలితాలు అధికారికంగా ప్రకటించనున్నారు.