
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఐ పోలవరం ఫిబ్రవరి 28:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ పోలవరం మండలం, భైరవపాలెం గ్రామంలో తాబేలు తప్పించుకునే పరికరాల (TEDs) వినియోగం పై సదరు గ్రామంలో తుఫాన్ షెల్టర్ నందు సోనా బోట్ కలిగిన యజమానులకు మరియు వాటి యందు పనిచేస్తున్న కలాశీలకు సముద్ర తాబేలు సంరక్షణ, సుస్థిర చేపల వేట మరియు TEDs వినియోగం పై అవగాహన, పరిశీలన మరియు శిక్షణ కార్యక్రమమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సముద్ర తాబేల్ల సంరక్షణ పై మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మత్స్యకారులకు TEDs వినియోగంపై అవగాహన కల్పించుటకు ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమమునకు శ్రీమతి K. భార్గవి , NFDB, హైదరాబాద్, ICAR-CIFT శాత్రవేత్త డా.రఘు ప్రకాష్, NETFISH శ్రీ హనుమతరావు , సిహెచ్.గోపాల కృష్ణ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కాట్రేనికోన, గ్రామ మత్స్య సహాయకులు రవి కిరణ్, సుగంధి బాబు, నరేష్ కుమార్, సాగర్ మిత్రాలు రజిని, రాజేశ్వరి, సంగీత మరియు గ్రామ పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు. రేపు ఈ కార్యక్రమనకు Axis Bank వారి CSR fund’s ద్వారా తెచ్చిన 85 తాబేలు తప్పించుకునే పరికరాలను జిల్లా కలెక్టరు వారి చేతుల మీదుగా పంపనీ చేయడం జరుగుతుంది అని కలెక్టరేట్ నుండి ప్రకటన విడుదల చేశారు.