స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15:

స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరికీ శిరస్సు వంచి నమస్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ కే మాధవి లు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడు కలను పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగు రవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ అంబేద్కర్ కాంక్ష విగ్రహాలకు పూలమాలల లంకరించి శ్రద్ధాంజలి ఘటిం చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేడుక మనకు కేవలం ఒక జాతీ య సెలవు దినం కాదనీ, మన గతాన్ని గుర్తు చేసు కుంటూ, వర్తమానాన్ని అంచనా వేసు కుంటూ, భవిష్యత్తు కోసం ప్రణా ళిక లు రూపొందించుకునే ఒక గొప్ప అవకాశం,గతాన్ని స్మరించుకుంటూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ పటేల్ వంటి ఎందరో గొప్ప నాయకులను మనం నేడు తప్పనిసరిగా స్మరించుకోవాలన్నారు.

వారి పోరాటం, వారి ఆశయాలు, వారి త్యాగాలు మనకు నిరంతర స్ఫూర్తిని స్తాయని. ఆనాటి ప్రజలు బ్రిటీష్ పాలన నుండి విముక్తి కోసం కలిసికట్టుగా పోరాడారని. వారి కలలు, ఆశయాలు మనం అనుభ విస్తున్న స్వేచ్ఛకు పునాదులు వేశాయన్నారు. గడచిన 78 సంవత్సరాలలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనం ఎన్నో విజయాలు సాధిం చామన్నారు వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, వైద్యం వంటి రంగాలలో భారత దేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు.

డిజి టల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశం మరింత ముందుకు సాగు తోందన్నారు. అయితే, ఇంకా ఎన్నో సవాళ్లు మన ముందు ఉన్నాయనీ. పేదరికం, నిరుద్యోగం, లింగ వివక్ష, పర్యావరణ సమస్య లు వంటి వాటిని మనం సమష్టిగా ఎదుర్కొనాల్సి ఉందన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్క పౌరుడు ఈ సవాళ్లను అధిగమించడానికి తన వంతు కృషి చేయాలని సూచించారు. కొత్తగా నిర్మిత మవుతున్న నవ భారతదేశంలో ప్రతి పౌరు డు భాగం కావాలని. యువత తమ ప్రతిభను, శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగిం చాలన్నారు.మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందిం చి,వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించాల న్నారు. నైపుణ్యా భివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకా శాలను మెరుగుపరచాల న్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించ డానికి పచ్చద నాన్ని పెంచడం, నీటిని సంరక్షించడం వంటి చిన్న చిన్న చర్యలతో మనం పెద్ద మార్పుకు నాంది పలకాల న్నారు. మన చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయ డం ద్వారా మానవత్వాన్ని చాటు కోవాలన్నారు భారత దేశం వివిధ సంస్కృతులు, భాషలు, మతాల కలయి కని ఈ వైవిధ్యమే మన బలమని. ఐక్యతతో మనం ఏదైనా సాధించగలమని. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దేశ సమగ్ర తను, అభివృద్ధిని కాపాడ టానికి పునరంకెదమవు దామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, ఏవో కాశీ విశ్వేశ్వ రరావు సమగ్ర శిక్ష మొబి లైజేషన్ అధికారి సుబ్రహ్మ ణ్యం రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన మాతా రమాబాయి సంఘం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం మే 20: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను రజిని మర్యాదపూర్వకంగా కలిశారు.మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ పుణ్యమంతుల రజనీ తన […]

సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10: సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు […]

దళిత సేన ఆధ్వర్యంలో ఘనంగా పీడిత జన హృదయ బొజ్జా తారకం 9వ.వర్ధంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 16: డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం స్థానిక కొంకపల్లి భూపయాగ్రహారం దగ్గర దళిత సేన ఆధ్వర్యంలో దళిత సేన […]

మానవత్వం పరిమళించిన వేల చిన్నారుల మోముల్లో వికసించిన చిరునవ్వులు

శభాష్ మంత్రి సుభాష్ గారు రామచంద్రపురం ప్రజానీకం మానవత్వం పరిమళించిన వేళ..చిన్నారుల మోముల్లో చిరునవ్వులు విరిసిన వేళ.. అభాగ్యుల జీవితాల్లో మెరిసిన హరివిల్లు. ఆనందాల నిండు జాబిలి విరిసిన వేళ.. నేనున్నానని మీకేం కాదని… […]