


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 05:


పర్యావరణ సమతుల్యతను జీవవైవిద్యాన్ని కాపాడటానికి నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమం వన మహోత్సవ కార్యక్ర మమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి జీవరాశి మనుగడకు తోడ్పాటు అందించాలని ఆర్డీవో కే మాధవి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో శనివారం స్థానిక అమలాపురం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆది త్య విద్యార్థుల ద్వారా జూలై 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్న వారోత్సవ వనమహోత్సవ ర్యాలీని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృక్షాలు ఆక్సిజ న్ విడుదల చేస్తూ, కార్బన్ డయాక్సైడ్ను తగ్గిస్తాయన్నారు.వాతావరణసమతుల్యతను కాపాడుతాయన్నారుభూసార పరిరక్షణ వృక్షాలు నేల కోతను తగ్గించి భూసారాన్ని పెంచుతాయన్నారు.
చెట్లు వర్షపాతాన్ని ఆకర్షించి, భూగర్భ జలాలను పెంచడానికి సహాయపడతాయన్నారు.అడవులు అనేక వన్య ప్రాణులకు ఆవాసంగా ఉంటాయన్నారు.వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో వృక్షాలు కీలక పాత్ర పోషిస్తాయ న్నారు.మొక్కలు నాట డం, వాటిని సంరక్షించడం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నా రు. సాధారణంగా వన మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో నిర్వహిస్తారన్నారు. రుతుపవనాల ఆగమనాన్ని బట్టి మొక్కలు నాటడానికి అను కూలమైన సమయాన్ని ఎంచుకోవడం జరుగు తుందన్నారు .ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయం తో పనిచేయాలని సూచిం చారు. ఈ ర్యాలీ కార్య క్రమంలో ఆదిత్య పాఠశాల ప్రిన్సిపల్ రామప్రసాద్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.